పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింట‌న్ అకాడ‌మీలో క‌రోనా క‌ల‌క‌లం

తాజాగా హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింట‌న్ అకాడ‌మీలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. బాడ్మింట‌న్ ప్లేయ‌ర్ సిక్కిరెడ్డికి క‌రోనా వైర‌స్ సోకింది. అలాగే ఫిజియోథెర‌పిస్ట్ కిర‌ణ్ జార్జ్‌కు కూడా కోవిడ్ పాజిటివ్ నిర్థార‌ణ..

పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింట‌న్ అకాడ‌మీలో క‌రోనా క‌ల‌క‌లం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2020 | 10:08 PM

ప్ర‌స్తుతం ఇప్పుడు ఎటు చూసినా క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇప్ప‌టికే ఎంతో మంది ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు దీని బారిన ప‌డుతూనే ఉంటున్నారు. ఇక తాజాగా హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింట‌న్ అకాడ‌మీలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. బాడ్మింట‌న్ ప్లేయ‌ర్ సిక్కిరెడ్డికి క‌రోనా వైర‌స్ సోకింది. అలాగే ఫిజియోథెర‌పిస్ట్ కిర‌ణ్ జార్జ్‌కు కూడా కోవిడ్ పాజిటివ్ నిర్థార‌ణ అయింది. దీంతో బాడ్మింట‌న్ అకాడ‌మీని మూసివేశారు అధికారులు. అలాగే అకాడ‌మీలో మొత్తం శానిటైజ్ చేశారు.

అలాగే బాడ్మింట‌న్ అకాడ‌మీలో ఇటీవ‌లే ప్రాక్టీస్ చేసిన ఆట‌గాళ్ల‌కు కూడా క‌రోనా వైర‌స్ పరీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు అధికారులు. కాగా, అదే అకాడమీలో స్టార్‌ షటర్లు పీవీ సింధు, పారుపల్లి కశ్యప్‌, సైనా నెహ్వాల్‌లు ప్రాక్టీస్‌ చేస్తూ ఉండటంతో వారిలో ఆందోళన మొదలైంది. ఇక‌ రెండు మూడు రోజులుగా సిక్కి రెడ్డి, కిర‌ణ్ జార్జ్‌ల‌ను క‌లిసిన వారిని గుర్తించే ప‌నిలో ఉన్నారు. వీరితో ఎవ‌రు ప్రైమ‌రీ కాంటాక్ట్ అయ్యారో వారి వివ‌రాలు సేక‌రిస్తున్నారు అధికారులు.

కాగా ప్ర‌స్తుతం తెలంగాణ‌లో 24 గంట‌ల్లో రాష్ట్రంలో 1931 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 86,475కు చేరింది. 11 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 665కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1780 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 63,074కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 22,736 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More:

గ్రాండ్‌గా నిహారిక కొణిదెల‌, జొన్న‌ల‌గ‌డ్డ‌ చైత‌న్య‌ల‌ ఎంగేజ్‌మెంట్

ఇక‌పై వాట్సాప్‌లోనే బోర్డింగ్ పాస్‌! ఎలాగంటే?

కోమాలో మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణబ్ ముఖ‌ర్జీః ఆర్మీ రీసెర్చ్ హాస్పిట‌ల్‌

భార‌త క్రికెట‌ర్‌కి క‌రోనా వైర‌స్ పాజిటివ్‌