శభాష్ ఏపీ పోలీస్..డీజీపీ ప్రశంసలు
ఏపీలో పోలీసు శాఖలో అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడ్డారు. ఈ క్రమంలోనే అనంతపురం పోలీసులపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి...
కరోనా పోరులో వైద్యసిబ్బందితో పాటు అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడుతున్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఏపీలో పోలీసు శాఖలో అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో వైరస్ బారినపడ్డారు. ఈ క్రమంలోనే అనంతపురం పోలీసులపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కరోనా బారినపడ్డ 17 మంది పోలీసులు తాజాగా ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. అనంతరం వారంతా ఇతర కరోనా రోగులకు ప్లాస్మా చికిత్స కోసం రక్తదానం చేశారు. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్…రక్తదానం చేసిన పోలీసులను అభినందించారు.
మరోవైపు, ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులలో దేశంలో ఎపి నాలుగో స్థానానికి చేరింది.. 3 లక్షల 84వేల కేసులతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలోనూ, 2 లక్షల 21 కేసులతో తమిళనాడు రెండో ప్లేస్ లోనూ, లక్షా 31వేల కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో ఉండగా, లక్షా 10వేల కేసులతో ఎపి నాలుగో స్థానంలో నిలించింది.. కాగా, మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో మరోసారి రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 62,979 శాంపిల్స్ పరీక్షించగా 7, 948 కొత్త కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం ఎపిలో కేసుల సంఖ్య లక్షా 10వేల 297కి చేరింది.