కేరళలో రోడ్డు కోసం ఎలా తన్నుకున్నారో చూడండి…
ఓ చిన్న వివాదం.. చిలికి చిలికి పెద్ద గొడవగా మారింది. రోడ్డు నిర్మాణంపై ఆ గ్రామం రెండుగా విడిపోయింది. ఆడ, మగ అనే తేడా లేకుండా ముష్టి యుద్ధానికి దారి తీసింది....
ఓ చిన్న వివాదం.. చిలికి చిలికి పెద్ద గొడవగా మారింది. రోడ్డు నిర్మాణంపై ఆ గ్రామం రెండుగా విడిపోయింది. ఆడ, మగ అనే తేడా లేకుండా ముష్టి యుద్ధానికి దారి తీసింది. ఈ మినీ విలేజ్ వార్.. కాస్తా కేరళ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ముష్టి యుద్ధంపై చర్చ జరుగుతోంది.
కేరళలోని అరత్తుపుళా గ్రామా పంచాయితీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం గ్రామంలో ఉన్న రోడ్లను వెడల్పు చేయాలని ఓ వర్గం డిమాండ్ చేసింది. దీనిని మరో వర్గం నో చెప్పింది. అయితే రోడ్డును వెడల్పు చేయాల్సిందే అని పట్టుబట్టింది మరో వర్గం . దీంతో ఇంత కాలం కలిసి ఉంటున్న ఆ గ్రామంలో ఆ గ్రామం రెండు ముక్కలైంది.
ఈ ఘర్షణల్లో రెండు వర్గాల వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియో తీస్తున్న ఓ యువకుడిని కూడా స్థానిక మహిళలు ఉతికి ఆరేశారని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న త్రికన్నాపుల పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. సమస్య శాంతియుతంగా పరిష్కరించే ఆలోచనలో ఉన్నారు పోలీసులు.