AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో పెరిగిన రికవరీలు.. ఒక్కరోజే 10 వేలకు పైగా..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి..

మహారాష్ట్రలో పెరిగిన రికవరీలు.. ఒక్కరోజే 10 వేలకు పైగా..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 28, 2020 | 9:02 PM

Share

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య వేలల్లో నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 10,333 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 7,717 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,91,440కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 2,32,277 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.44 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 14 వేల మంది మరణించారు. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఇప్పటి వరకు ముంబై నగరంలో నమోదయ్యేవి. అయితే అనూహ్యంగా ముంబై నగరంలో కరోనా టెస్టులు పెంచడంతో.. క్రమక్రమంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ముంబై నగరంలో ఏడు వందల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబై నగర వాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

Follow Us
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..