AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: రాజధాని వాసులకు గుడ్‌న్యూస్.. తగ్గుముఖం పడుతున్న కరోనా.. తాజాగా 89 కేసులు..

Delhi Covid-19 cases: దేశ రాజధాని ఢిల్లీని కరోనా సెకండ్ వేవ్ ఇటీవల గడగడలాడించిన విషయం తెలిసిందే. నిత్యం వేలాది కరోనా కేసులు, వందలాది కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే.. ప్రస్తుతం రాజధాని

Delhi: రాజధాని వాసులకు గుడ్‌న్యూస్.. తగ్గుముఖం పడుతున్న కరోనా.. తాజాగా 89 కేసులు..
Corona Cases
Shaik Madar Saheb
|

Updated on: Jun 22, 2021 | 5:51 AM

Share

Delhi Covid-19 cases: దేశ రాజధాని ఢిల్లీని కరోనా సెకండ్ వేవ్ ఇటీవల గడగడలాడించిన విషయం తెలిసిందే. నిత్యం వేలాది కరోనా కేసులు, వందలాది కరోనా మరణాలు నమోదయ్యాయి. అయితే.. ప్రస్తుతం రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రతిరోజూ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలో కేసుల సంఖ్య 100కు దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాజధానిలో 57,128 మందికి పరీక్షలు నిర్వహించగా.. 89 మందికి మాత్రమే పాజిటివ్‌గా తేలింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇదే అత్యల్పమని అధికారులు తెలిపారు. పాజిటివిటీ రేటు కూడా దిగివస్తోంది. ప్రస్తుతం 0.16 శాతానికి పడిపోయింది. కరోనా మొదలైనప్పటి నుంచి ఢిల్లీలో ఇదే అత్యల్పం.

ఇదిలాఉంటే.. ఢిల్లీలో యాక్టివ్‌ కేసులు కూడా 2000 దిగువకు వచ్చాయి. ప్రస్తుతం 1996 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.12 శాతానికి పెరిగింది. ఇప్పటివరకు ఢిల్లీలో 14,32,381 మందికి కొవిడ్‌ సోకగా.. అందులో 14,05,460 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 11 మంది మరణించారు. వీరితో కలిపి మొత్తం 24,925 మంది ప్రాణాలు కోల్పోయారు. అయతే.. కరోనా సెకండ్‌ వేవ్‌ అదుపులోకి వస్తున్నప్పటికీ.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

కష్టకాలంలో వైద్యులకు సహాయపడేందుకు, వైద్య సేవలను వేగంగా విస్తరించేందుకు వీలుగా 5వేల మంది యువకులకు హెల్త్‌ అసిస్టెంట్లుగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Also Read:

Vincent Raja car: అన్నాడీఎంకే బహిష్కృత నేత కారును తగలబెట్టిన దుండగులు.. CCTV దృశ్యాలు

అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి.. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి తిరిగిరాని లోకాలకు…

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం