‘కోవిడ్’ అంబులెన్స్ డ్రైవర్ కరోనా వైరస్ తో మృతి

కోవిడ్ వారియర్ అయిన ఓ అంబులెన్స్ డ్రైవర్ ఆరిఫ్ ఖాన్ ఆ కోవిడ్ మహమ్మారికే గురై మరణించాడు. ఢిల్లీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మృతి చెందిన కరోనా వైరస్ రోగులను తన అంబులెన్స్ లో అంత్యక్రియల స్థలానికి తీసుకువెళ్లే ఈయన.. చివరకు తానూ మృతి చెందాడు. నగరంలో ఓ స్వఛ్చంద సంస్ధ తరఫున పని చేస్తున్న ఆరిఫ్ ఖాన్, రోజూ గంటల తరబడి తన కుటుంబానికి దూరంగా ఉంటూ కరోనా రోగుల సేవలో ఉంటూ వచ్చాడు. ఈ […]

'కోవిడ్' అంబులెన్స్ డ్రైవర్ కరోనా వైరస్ తో మృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 11, 2020 | 1:13 PM

కోవిడ్ వారియర్ అయిన ఓ అంబులెన్స్ డ్రైవర్ ఆరిఫ్ ఖాన్ ఆ కోవిడ్ మహమ్మారికే గురై మరణించాడు. ఢిల్లీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మృతి చెందిన కరోనా వైరస్ రోగులను తన అంబులెన్స్ లో అంత్యక్రియల స్థలానికి తీసుకువెళ్లే ఈయన.. చివరకు తానూ మృతి చెందాడు. నగరంలో ఓ స్వఛ్చంద సంస్ధ తరఫున పని చేస్తున్న ఆరిఫ్ ఖాన్, రోజూ గంటల తరబడి తన కుటుంబానికి దూరంగా ఉంటూ కరోనా రోగుల సేవలో ఉంటూ వచ్చాడు. ఈ సంస్థ నుంచి తనకు ఆదాయం తక్కువ వస్తున్నప్పటికీ.. దాన్ని పట్టించుకోకుండా తన సగం జీవితాన్ని అంబులెన్స్ ని నడపడంలోనే సాగించాడు. ఇండియాలో కరోనా వైరస్ కేసులు దాదాపు 70 లక్షలకు చేరుకున్నాయి.