AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్జీవీ పై నేడే పోరాడుదాం రండి: దిశ తండ్రి పిలుపు

తన కూతురు దిశ అత్యాచారోదంతంపై వర్మ తీస్తున్న సినిమా (‘దిశ ఎన్ కౌంటర్’) ఆపాలంటూ నిన్న డిమాండ్ చేసిన దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి మళ్లీ టీవీ9 ముందుకొచ్చారు. ఈ సినిమా నిర్మాత నట్టికుమార్ .. టీవీ9తో దిశ తండ్రి చేసిన వ్యాఖ్యలపై నిన్ననే వివరణ ఇచ్చినప్పటికీ శ్రీధర్ రెడ్డి ఆగ్రహం చల్లారటంలేదు. ఇది దిశ బయోపిక్ కాదంటూ నట్టికుమార్ చెప్పుకొచ్చిన మాటల్ని శ్రీధర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వర్మ శవాల మీద డబ్బులు ఎరుకుంటున్నాడు అంటూ […]

ఆర్జీవీ పై నేడే పోరాడుదాం రండి: దిశ తండ్రి పిలుపు
Venkata Narayana
|

Updated on: Oct 11, 2020 | 11:09 AM

Share

తన కూతురు దిశ అత్యాచారోదంతంపై వర్మ తీస్తున్న సినిమా (‘దిశ ఎన్ కౌంటర్’) ఆపాలంటూ నిన్న డిమాండ్ చేసిన దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి మళ్లీ టీవీ9 ముందుకొచ్చారు. ఈ సినిమా నిర్మాత నట్టికుమార్ .. టీవీ9తో దిశ తండ్రి చేసిన వ్యాఖ్యలపై నిన్ననే వివరణ ఇచ్చినప్పటికీ శ్రీధర్ రెడ్డి ఆగ్రహం చల్లారటంలేదు. ఇది దిశ బయోపిక్ కాదంటూ నట్టికుమార్ చెప్పుకొచ్చిన మాటల్ని శ్రీధర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వర్మ శవాల మీద డబ్బులు ఎరుకుంటున్నాడు అంటూ టీవీ9 తో శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ ఉదయం 9.30 గంటలకు వర్మ ఇంటిముందు ధర్నాకు దిగుతున్నానని ప్రకటించారు. రెడ్డి సంఘంతో కూడి ధర్నాలో పాల్గొంటామని వెల్లడించారు. నా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఇంకా మరచిపోక ముందే మళ్ళీ ఇలా చేయడం మా దురదృష్టం అని ఆతండ్రి వాపోయారు.

దిశ ఘటన సమయంలో మాకు తోడున్న ప్రజలు ఇప్పుడు మళ్లీ మాకు బాసటగా నిలవాలని కోరుతున్నానని ఆయన పిలుపునిచ్చారు. “ఆర్జీవీ దిశ పేరుతో ట్రయిలర్ రిలీజ్ చేసి మళ్ళీ మమ్మల్ని రోడ్డున నిలబెడుతున్నాడు. నా కూతురుకు జరిగే అన్యాయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించను. నా కూతురికి జరిగిన దారుణాన్ని మరువక ముందే.. ఆ విదారక ఘటనను మళ్లీ సినిమా తెరకు ఎక్కించి కాసులకు కక్కుర్తి పడటం మంచి పద్ధతి కాదు” అని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి అన్నారు.

Follow Us
Video: హిల్‌ స్టేషన్‌లో సిగ్గుచేటు.. చెత్త ఏరిన విదేశీ యువతి
Video: హిల్‌ స్టేషన్‌లో సిగ్గుచేటు.. చెత్త ఏరిన విదేశీ యువతి
ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు డబుల్ ధమాకా.. పాస్ ధరలు తగ్గాయ్
ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు డబుల్ ధమాకా.. పాస్ ధరలు తగ్గాయ్
దక్షిణ భారతంలో దీపావళి అంటే నరకాసుర వధే.. శ్రీకృష్ణుడి విజయగాథ..
దక్షిణ భారతంలో దీపావళి అంటే నరకాసుర వధే.. శ్రీకృష్ణుడి విజయగాథ..
GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
GTA 6 ఆడాలని ఆశపడ్డాడు.. గేమ్ విడుదలకు ముందే కన్నుమూత!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
Video: దుబాయ్‌లో రచ్చ.. పాక్ బాక్సర్ చెంప పగలగొట్టిన భారత ఫైటర్!
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ఆ సినిమా కోసం ఎంతో రిస్క్ చేశా.. ఎంతో తెలుసుకున్నా..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ట్రంప్ ఓటమితో బంగారం ధరల్లో కుదుపు.. ఒక్కరోజే అన్నీ తారుమారు..
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
ఒక్క ఆ దేశంలో తప్ప.. ప్రపంచంలో ఎక్కడైనా విరాట్ కోహ్లీ పరుగుల వరదే
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
మదనపల్లెలో లేడీ డాన్ కోనేటి సులోచన అరెస్ట్.. నకిలీ పత్రాలతో..
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!
అందరూ నవ్వినా వెనక్కి తగ్గలేదు.. ఒంటరిగా పోరాడి గెలిచాడు!