తెలుగు రాష్ట్రాల్లో కోరలు చాస్తున్న కరోనా.. దేశం @ 23 వేలు..
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 23077కి చేరింది.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 23077కి చేరింది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 718 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా సంబంధిత మరణాలు మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్పటి వరకు 283 మంది మరణించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌లలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 1,855 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇవి చదవండి:
మిస్టరీ డెత్స్: కరోనా వేళ.. 50 కాకులు, మూడు కుక్కలు మృతి..
భారత్ క్రికెటర్లు సెంచరీలు కోసం.. పాకిస్తాన్ ప్లేయర్స్ దేశం కోసం ఆడతారు..
గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.
