కరోనాతో సీపీఎం నేత మృతి
కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను పొట్టనబెట్టుకుంటుంది. తాజాగా వెస్ట్ బెంగాల్‌కు చెందిన సీపీఎం సీనియర్ నేత ఒకరు కరోనాతో మరణించారు. పార్టీకి చెందిన సీనియర్ నేత శ్యామల్ చక్రవర్తి గత కొద్ది రోజులుగా కరోనా..
కరోనా మహమ్మారి ప్రజాప్రతినిధులను పొట్టనబెట్టుకుంటుంది. తాజాగా వెస్ట్ బెంగాల్‌కు చెందిన సీపీఎం సీనియర్ నేత ఒకరు కరోనాతో మరణించారు.పార్టీకి చెందిన సీనియర్ నేత శ్యామల్ చక్రవర్తి గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ సోకి పోరాడుతున్నారు. కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరోనాతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని వెస్ట్ బెంగాల్ సీపీఎం పార్టీ ధృవీకరించింది. ఆయన వయస్సు 76 ఏళ్లు. 1982 నుంచి 1996 వరకు వెస్ట్ బెంగాల్‌లో మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. జూలై 30వ తేదీన ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. వెంటనే కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో ఆయనను వెంటిలేషన్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఆయన మరణించారు. శ్యామల్ మరణం పట్ల వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read More :