తెలంగాణ‌కు ఊర‌ట‌..25వేల మంది విడుద‌ల !

తెలంగాణ‌కు ఊర‌ట‌..25వేల మంది విడుద‌ల !

భార‌త్‌లో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన 8 రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు సగటున 500 వరకు నమోదవుతున్నాయి. బుధవారం దేశవ్యాప్తంగా మరో 600పైగా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,916 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. 180 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 565 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇటు, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైర‌స్ ఉదృతి ఎక్కువ‌గానే ఉంది. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 49 కొత్త కేసులు […]

Jyothi Gadda

| Edited By: Pardhasaradhi Peri

Apr 09, 2020 | 3:28 PM

భార‌త్‌లో కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. గడచిన 8 రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు సగటున 500 వరకు నమోదవుతున్నాయి. బుధవారం దేశవ్యాప్తంగా మరో 600పైగా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,916 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. 180 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 565 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
ఇటు, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైర‌స్ ఉదృతి ఎక్కువ‌గానే ఉంది. బుధవారం ఆంధ్రప్రదేశ్‌లో 34, తెలంగాణలో 49 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు ఏపీలో 348, తెలంగాణలో 453కి చేరుకున్నాయి. ఏపీలో 9 మంది, తెలంగాణలో 43 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. అలాగే రెండు రాష్ట్రాల్లో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కొత్తగా మరో 49 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడి 11 మంది మృతిచెందగా.. 45 మంది పూర్తిగా కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రుల్లో 397 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, క‌రోనా నేప‌థ్యంలో వేల సంఖ్య‌లో అనుమానితుల్ని హోం క్వారంటైన్‌లో ఉంచిన సంగ‌తి తెలిసిందే.
అయితే, వారిలో సుమారుగా 25 వేల మందిని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. వీరంతా కూడా విదేశాల నుంచి వ‌చ్చిన వారే. క‌రోనా నేప‌థ్యంలో అంద‌రినీ రెండు వారాల హోం క్వారంటైన్‌లో ఉండాల‌ని సూచించింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఈ రోజుతో వాళ్ల‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లుగా అధికార వ‌ర్గాల స‌మాచారం. కేవ‌లం విదేశాల నుంచి వ‌చ్చిన వాళ్ల‌నే కాకుండా వారిని క‌లిసిన వ్య‌క్తుల‌కు కూడా ఈ రోజుతో గ‌డువు ముగిసింది. వీరిలో ఎవ‌రికీ క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని తేలింది. దీంతో వారివారి ఇళ్లకు అతికించిన కరోనా అలెర్ట్ స్టిక్కర్ల ను   తొలగించనున్నారు. వీరందరికి ముందు జాగ్రత్త చర్యగా మాస్కులు శానిటైజర్లు అంద‌జేస్తారు. అలాగే ఈ రోజు నుండి వీరి ఇళ్లపై పోలీసు రెవెన్యూ అధికారుల నిఘా తొలగించనున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప‌టిష్టమైన చ‌ర్య‌ల ఫ‌లితంగానే రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డిలో ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu