ఉమ్మడి కుటుంబంలో కరోనా కల్లోలం…12 మందికి పాజిటివ్‌

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా ఇప్పుడు జిల్లాలను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలను వైరస్‌ వణికిస్తోంది. తాజగా సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.

ఉమ్మడి కుటుంబంలో కరోనా కల్లోలం...12 మందికి పాజిటివ్‌
Follow us

|

Updated on: Jul 18, 2020 | 9:50 PM

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా ఇప్పుడు జిల్లాలను కూడా వణికిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలను వైరస్‌ వణికిస్తోంది. తాజగా సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 12 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌ పట్టణంలో ఓ కుటుంబంలో 12 మందికి కరోనా సోకినట్లుగా శనివారం రోజున అధికారులు గుర్తించారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నివాసముండే ఓ వ్యక్తి నాలుగు రోజులుగా గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నాడు. వారి ఇంట్లో ఉంటున్న మిగతా వారందరూ కూడా అవే లక్షణాలతో బాధపడుతుండటంతో… కరోనా సోకిందనే అనుమానానికి వచ్చారు. శనివారం రోజున హైదరాబాద్ మదీనగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన ఆ కుటుంబ సభ్యులు 14 మంది కరోనా టెస్టు చేయించుకున్నారు. కాగా, వారిలో 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే స్థానిక మున్సిపల్ అధికారులకు సమాచారం అందజేశారు. విషయం తెలిసిన కమిషనర్‌ సుజాత సిబ్బందితో వెళ్లి కాలనీలో రసాయనాలతో శుద్ధి చేయించారు. ఒకే కుటుంబంలో ఒకేసారి 12 మందికి కరోనా రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, సిద్దిపేట జిల్లాలో శనివారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 174 కు చేరిందని అధికారులు తెలిపారు.