Prabhas: రాజాసాబ్ రిజల్ట్‌పై ప్రభాస్ షాకింగ్ రియాక్షన్
ప్రభాస్ నటించిన 'రాజాసాబ్' మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడంతో, దాని ఫలితంపై ప్రభాస్ స్పందనపై ఉత్సుకత నెలకొంది. ఈ ప్రశ్నకు నటి నిధి అగర్వాల్ తెరదించారు. ప్రభాస్ ఫలితాలను పట్టించుకోరని, తన పనిని తాను చేసుకుపోతారని ఆమె వెల్లడించారు. ప్రభాస్ అత్యంత నిష్కల్మషమైన, నిగర్వియైన వ్యక్తి అని, ఆయన నిజాయితీని ప్రశంసించారు.
ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రాజాసాబ్. హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి బరిలో మొదటి సినిమాగా ల్యాండ్ అయింది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్‌లోనూ వెనక పడింది. దీంతో ఈ మూవీ రిజెల్ట్ పై ప్రభాస్ ఎలా ఫీలవుతున్నాడనే క్యారియాసిటీ జనాల్లో ఉంది. ఇప్పుడా క్యూరియాసిటీకి తెర పడేలా.. రాజాసాబ్ రిజెల్ట్ పై ప్రభాస్ రియాక్షన్ ఏంటనేది చెప్పేసింది.. ఈ మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్. తాజాగా ఓ ఇంటర్వ్యూకి వెళ్లిన నిధి అగర్వాల్.. ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ప్రభాస్ ఎటువంటి రాజకీయాల్లో తలదూర్చడంటూ చెప్పుకొచ్చింది. తన పనేదో తాను చేసుకుపోతాడని.. ఫేక్‌గా ఉండలేడంటూ చెప్పుకొచ్చింది. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని.. ఆయనంత హుందాగా తాను ఉండగలనా? అని తనను తాను ప్రశ్నించుకుంటా అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ప్రభాస్ ది .. చిన్నపిల్లాడి మనస్తత్వమని.. ఎంతో నిష్కల్మషంగా ఉంటాడని.. ప్రేమగా మాట్లాడతాడని చెప్పుకొచ్చింది. ఎవరూ కలిసినా.. తాను ఓ స్టార్ అన్న విషయమే మరిచిపోయి ప్రభాస్ మాట్లాడుతాడంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. ‘ప్రభాస్ దేనికీ లెక్కలేసుకోడు, కమర్షియల్‌గా ఉండటం రాదు. పైగా తనకు ఎటువంటి పీఆర్ టీమ్ లేదు. తనతో పనిచేశాక ఆయనపై గౌరవం మరింత పెరిగింది. నా జీవితంలో నేను కలిసిన అత్యంత మంచి వ్యక్తి ప్రభాసే.. సినిమా కోసం తనవంతు కృషి చేస్తాడు. దాని రిజల్ట్ గురించి అసలు పట్టించుకోడు’ అంటూ ప్రభాస్ గురించి నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Faria Abdullah: అతడితో ప్రేమలో ఉన్నాను.. రిలేషన్ పై ఓపెన్ అయినా ఫరియా అబ్దుల్లా
Cheekatilo Review: రొటీన్ సినిమానే కానీ.. ట్విస్ట్‌తో థ్రిల్ వస్తుంది
Gold Price: గోల్డ్.. సామాన్యులకు ఇక అందని ద్రాక్షేనా..!
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..

