చేప పచ్చడి.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.. జన్మలో మర్చిపోరు!

Prasanna Yadla

24 January 2026

Pic credit - Pixabay

మనం ఇప్పటి వరకు చికెన్, మటన్ తో కూరలు, పచ్చళ్ళు చేసుకోవడం చూసాము. కానీ,  చేపలతో ఎక్కువగా కర్రీస్ మాత్రమే చేస్తాము. కానీ, చేపలతో పచ్చడి పెట్టడానికి కూడా ఎవరూ సాహసం చెయ్యరు. 

చేప పచ్చడి

ఎందుకంటే, వాటిని పట్టుకోవడానికి కొందరు భయ పడతారు. ఎక్కడ చేప ముల్లు చేతులకు గుచ్చుకుంటాయో అని సందేహిస్తూ ఆగిపోతారు. అందుకే చేప పచ్చడి చేయడానికి ఇష్ట పడరు. 

ఆ భయం వద్దు 

అలాంటి భయాలు  అవసరం లేదు. వీటితో కర్రీస్ చేయడం నేర్చుకునే ఉంటారు. ఇప్పుడు వైరైటీగా  చేప  పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

వైరైటీ చేప పచ్చడి 

ముందుగా ముళ్లులేని, మీరు  ఎలాంటి  చేపలు తింటే ఆ చేపను చిన్నగా  ముక్కలు చేసుకుని ఆ తర్వాత వాటిని ఉప్పు నీటితో శుభ్ర పరచుకోవాలి. 

స్టెప్ - 1

ఇక ఇప్పుడు స్టవ్  వెలిగించి పాన్ పెట్టి  నూనె వేసి అది వేడయ్యాక  చేప ముక్కల్ని వేసుకుని రంగు మారే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత వాటిని కిందకు దించేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.

స్టెప్ - 2

ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టి  నూనె వేసి అది వేడయ్యాక ఆవాలు వేసి బాగా వేయించండి. దీనికి మీరు రోజూ వాడే ఆయిల్ కూడా సరిపోతుంది. కాకపోతే మంచి నూనె అయితే  రుచికరంగా ఉంటుంది.

స్టెప్ - 3

ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, మిర్చి వేసి బాగా వేయించాలి. కొంత సేపటి తర్వాత పసుపు, కారం, రుచికి తగినంత ఉప్పు వేసి దానిలో గరిటెతో తిప్పుతూ ఉండండి.

స్టెప్ - 4

ఇక చివర్లో పక్కన పెట్టుకున్న చేప ముక్కలు తీసుకుని వాటికీ కారం పట్టించి 4 నిముషాల పాటు స్టవ్ మీదనే ఉంచి ఆ తర్వాత దించేసుకోవాలి.  

స్టెప్ - 5

చేపల పచ్చడి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఒక రోజు తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది.వేడి వేడి అన్నంలో అయితే రుచికరంగా ఉంటుంది.  ఇక ఇప్పుడు దీన్ని ఫాలో అయ్యి  ఫిష్ పచ్చడి చేసేయండి.

స్టెప్ - 6