AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్లాస్మా దానానికి ముందుకు రావాలంటూ గవర్నర్‌ పిలుపు

తెలంగాణలో ఎవరూ కరోనాతో చనిపోకూడదని.. అదే తన లక్ష్యమని గవర్నర్‌ తమిళిసై అన్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా సీరియస్‌గా ఉన్న కరోనా బాధితులను రక్షించవచ్చని చెప్పారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో శనివారం..

ప్లాస్మా దానానికి ముందుకు రావాలంటూ గవర్నర్‌ పిలుపు
Jyothi Gadda
|

Updated on: Jul 18, 2020 | 9:05 PM

Share

తెలంగాణలో ఎవరూ కరోనాతో చనిపోకూడదని.. అదే తన లక్ష్యమని గవర్నర్‌ తమిళిసై అన్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా సీరియస్‌గా ఉన్న కరోనా బాధితులను రక్షించవచ్చని చెప్పారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో శనివారం ప్లాస్మా బ్లడ్ బ్యాంకును సందర్శించిన సందర్భంగా గవర్నర్ మీడియాతో మాట్లాడారు.

రక్తదానంపై ప్రజల్లో ఒక సాధారణ అపోహలు ఉన్నట్లుగానే ప్లాస్మా దానంపైనా ఉంటాయని, కానీ అలాంటి భయాలు అవసరం లేదని, మరో రకంగా ఇలాంటి దానాలు చేయడం ద్వారా ఎప్పటికప్పుడు కొత్త కణాలు పుడుతూ మరింత ఆరోగ్యవంతంగా ఉంటామని, ఒక వైద్యురాలిగా చెప్తున్నానని గవర్నర్ వివరించారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చి తగ్గిన వారు ప్లాస్మాను డొనేట్‌ చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్లాస్మా డోనర్లు‌ ఈఎస్‌ఐ ఆస్పత్రికి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ప్లాస్మా డోనార్‌ సంతోష్‌కు పుష్ప గుచ్ఛం ఇచ్చి గవర్నర్‌ అభినందించారు. తెలంగాణ ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పక పాటించాలని గవర్నర్ సూచించారు.

Follow Us
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు