జైపూర్ సంగనేర్ ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రేమ సేథ్, హనుమాన్ ప్రసాద్ మధ్య ప్రేమ చిగురించింది. హత్య కేసుల్లో ఖైదీలైన వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కోర్టు వారికి 15 రోజుల అత్యవసర పెరోల్‌ను మంజూరు చేయగా, వీరు జైపూర్‌లో వివాహం చేసుకోనున్నారు. ఈ ఖైదీల ప్రేమ పెళ్లి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.