AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. స్పెషల్‌ రైళ్లు మరికొన్ని రోజులు పొడిగింపు!

సంక్రాంతి పండుగ ముగిసినా రైల్వే ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం వీక్లీ స్పెషల్ రైలు సేవలను మరికొన్ని రోజులు పొడిగించింది. ఫిబ్రవరి వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. స్పెషల్‌ రైళ్లు మరికొన్ని రోజులు పొడిగింపు!
Trains 5
SN Pasha
|

Updated on: Jan 24, 2026 | 5:48 PM

Share

సంక్రాంతి పండుగ ముగిసినప్పటికీ రైల్వే ప్రయాణికుల రద్దీ మాత్రం తగ్గలేదు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ గమ్యస్థానాలకు వెళ్తున్న వీక్లీ స్పెషల్‌ రైలు సేవలు మరికొన్ని రోజులు పొడిగించింది. ప్రస్తుతం టిక్కెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి ఈ పొడగింపు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ప్రతి ట్రైన్‌ 4 ట్రిప్పులు నడవనుంది.

  • రైలు నంబర్‌ 07191 కాచిగూడ టు మధురై (సోమవారం) 02.02.2026 నుంచి 23.02.2026
  • రైలు నంబర్‌ 07192 మధురై టు కాచిగూడ (బుధవారం) 04.02.2026 నుంచి 25.02.2026
  • రైలు నంబర్‌ 07193 హైదరాబాద్ టు కొల్లం (శనివారం) 31.01.2026 నుంచి 21.02.2026
  • రైలు నంబర్‌ 07194 కొల్లం టు హైదరాబాద్ (సోమవారం) 02.02.2026 నుంచి 23.02.2026
  • రైలు నంబర్‌ 07230 హైదరాబాద్ టు కన్యాకుమారి (బుధవారం) 04.02.2026 నుంచి 25.02.2026
  • రైలు నంబర్‌ 07229 కన్నియాకుమారి టు హైదరాబాద్ (శుక్రవారం) 06.02.2026 నుంచి 27.02.2026
  • రైలు నంబర్‌ 07219 నరసాపూర్ టు తిరువణ్ణామలై (బుధవారం) 04.02.2026 నుంచి 25.02.2026
  • రైలు నంబర్‌ 07220 తిరువణ్ణామలై టు నర్సాపూర్ (గురువారం) 05.02.2026 నుంచి 26.02.2026

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి