కోరలు చాస్తున్న కరోనా… అక్కడ మరో 11 మందికి వైరస్ !

భారత్‌లోనూ కరోనా పంజా విసురుతోంది. ఎక్కువగా మహారాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు అవుతుండగా, తాజాగా మరో...

కోరలు చాస్తున్న కరోనా... అక్కడ మరో 11 మందికి వైరస్ !
Jyothi Gadda

|

Mar 16, 2020 | 12:19 PM

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా దెబ్బకు ప్రపంచం విలవిలలాడుతోంది. రోజురోజుకి కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 157 దేశాలకు వ్యాపించింది. రోజు రోజుకి కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. చైనాలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. అదే సమయంలో భారత్‌లోనూ కరోనా పంజా విసురుతోంది. ఎక్కువగా మహారాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు అవుతుండగా, తాజాగా మరో 11 మంది వైరస్ అనుమానితులు ఓ ఆస్పత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. వారంతా దుబాయ్ నుంచి వచ్చినట్లుగా ట్రావెల్ హిస్టరీ పరిశీలించిన వైద్యాధికారులు వెల్లడించారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరస్ లక్షణాలతో కనిపించటంతో వారిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచినట్లుగా తెలుస్తోంది. ఒకేసారి 11 మందికి వైరస్ లక్షణాలు బయటపడటంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా యావత్ భారతదేశం ఉలిక్కిపడుతోంది.

దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న వైరస్‌తో మరింత ఆందోళనవ్యక్తమవుతోంది. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నట్లే… తెలంగాణలో కూడా కరోనా గుబులు రేపుతోంది. తాజాగా తెలంగాణలో మరో రెండు కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. కరోనా నియంత్రణకు ఇప్పటికే కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మార్చి 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. అలాగే థియేటర్లు, పబ్ లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేశారు. పార్లమెంట్ సముదాయంలోకి సందర్శకులకు ఎంట్రీ నిషేధించారు. అంతర్జాతీయ సరిహద్దుల దగ్గర ఆంక్షలు విధించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu