విజృంభిస్తోన్న ‘కరోనా’.. ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండిలా..!

కరోనా వైరస్ ముప్పు ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రమాదకరంగా మారుతోంది. మనదేశంలో ఇప్పటికే వైరస్ రెండో దశకు చేరడంతో.. అందరిలో ఆందోళన ఎక్కువవుతోంది. మరోవైపు ఈ వైరస్‌ను కొత్తది కావడంతో.. ఇంకా మందును కనుగొనలేదు.

విజృంభిస్తోన్న 'కరోనా'.. ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండిలా..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 16, 2020 | 8:14 AM

కరోనా వైరస్ ముప్పు ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రమాదకరంగా మారుతోంది. మనదేశంలో ఇప్పటికే వైరస్ రెండో దశకు చేరడంతో.. అందరిలో ఆందోళన ఎక్కువవుతోంది. మరోవైపు ఈ వైరస్‌ను కొత్తది కావడంతో.. ఇంకా మందును కనుగొనలేదు. దీంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వైరస్ బారిన పడకుండా ఉండటం మాత్రమే మన చేతుల్లో ఉంది. ముఖ్యంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు.. ఇంటి చిట్కాలతో వైరస్‌ నుంచి కాపాడుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పసువు, కలబంద, వేప, తులసి మంచిదని పలువురు డాక్టర్లు చెబుతున్నారు. మన పూర్వకాలంలో వైరస్‌ల బారిన పడకుండా వీటినే ఉపయోగించేవారని వారు అంటున్నారు.

పసుపు: ఇంట్లోంచి బయటకెళ్లేటప్పుడు చేతులకు పసుపు రాసుకుంటే కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

కలబంద: కలబంద రసాన్ని బయటకు వెళ్లే ముందు ముఖానికి, చేతులకు కొద్దిగా పెట్టుకుని వెళ్తే వైరస్‌ల నుంచి రక్షణగా ఉంటుంది.

వేప: వైరస్‌ల నుంచి కాపాడుకోవడంలో వేపకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మన సంప్రదాయల్లో ఒక్కటిగా వస్తోన్న వేప.. పలు వైరస్‌ల నుంచి కాపాడగలదు. వేప లేత చిగురు, ఆకులను తినడం వల్ల వైరస్‌ల బారి నుంచి కాపాడుకోవచ్చు.

తులసి: తులసి ఆకులను తినడం, తులసి తీర్థం తీసుకోవడం వలన వైరస్‌ల నుంచి రక్షించుకోవచ్చు.

వీటితో పాటు భారతీయ వంటలల్లో విరివిగా ఉపయోగించే వెల్లుల్లి, ఉల్లి, జీలకర్ర, మిరియాలు, అల్లంలోనూ చక్కటి ఔషద గుణాలున్నాయి. వీటి ద్వారా రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు.. వైరస్‌ల నుంచి కాపాడుకోవచ్చు.

Read This Story Also: కరోనా వైరస్‌.. ఎయిర్‌పోర్ట్ అధికారులపై రష్మీ సంచలన ట్వీట్లు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu