Corona: ఆ ఏడు రాష్ట్రాల్లోనే 90శాతం కరోనా కేసులు.. అత్యధికంగా ఏయే రాష్ట్రాల్లో నమోదయ్యాయంటే..?
India Coronavirus: దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ కూడా ప్రకటించారు. చాలా రాష్ట్రాల్లో..
India Coronavirus: దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్త మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ కూడా ప్రకటించారు. చాలా రాష్ట్రాల్లో కఠినమైన ఆంక్షలతో ప్రయాణికులను అనుమతిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్‌లో నెగిటివ్ రిపోర్టు ఉంటేనే అధికారులు ఆయా రాష్ట్రాల్లోకి అనుమతిస్తున్నారు. అయితే తాజాగా ఏడు రాష్ట్రాల్లోనే కొత్తగా 90శాతం కోవిడ్-19 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. దేశంలో నమోదైన కొత్త కేసుల్లో ఏడు రాష్ట్రాల్లో మొత్తం 89.57 శాతం కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మహారాష్ట్రలో అత్యధికంగా 8,807 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కేరళలో 4,106, పంజాబ్ రాష్ట్రంలో 558, తమిళనాడులో 463, గుజరాత్‌లో 380, మధ్యప్రదేశ్‌లో 344, కర్ణాటకలో 334 కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. వీటితో కలిపి దేశ వ్యాప్తంగా మొత్తం 16,738 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
కాగా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు కేంద్రం రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతూ.. చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్లు తగ్గి.. మళ్లీ పెరుగుతుండంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది.
1.30కోట్లమందికి వ్యాక్సినేషన్ పూర్తి.. ఇదిలాఉంటే.. దేశంలో గురువారం వరకు 1.30కోట్లమందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో ఈ రోజు 3.95 లక్షల మందికి మొదటి డోస్ కాగా.. 2,44,511 మందికి రెండో డోస్ ఇచ్చినట్లు కేంద్రం పేర్కొంది.
Also Read: