AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ కార్మికుల కోసం ప్రభాస్ భారీ విరాళం..

Coronavirus: కరోనా వైరస్ కారణంగా దేశంలో మొత్తం లాక్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పని చేసే రోజూవారీ కూలీలకు, జూనియర్ ఆర్టిస్టులకు పనులు లేక ఇంటికే పరిమితమయ్యారు. వారి కుటుంబాలు కూడా గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ప్రారంభమైంది. సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న కార్మికులను ఆదుకునేందుకు ఈ ఛారిటీ ద్వారా టాలీవుడ్ హీరోలు మేము సైతం అంటూ విరాళాలు […]

సినీ కార్మికుల కోసం ప్రభాస్ భారీ విరాళం..
Ravi Kiran
|

Updated on: Mar 30, 2020 | 2:12 PM

Share

Coronavirus: కరోనా వైరస్ కారణంగా దేశంలో మొత్తం లాక్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పని చేసే రోజూవారీ కూలీలకు, జూనియర్ ఆర్టిస్టులకు పనులు లేక ఇంటికే పరిమితమయ్యారు. వారి కుటుంబాలు కూడా గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ప్రారంభమైంది.

సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్న కార్మికులను ఆదుకునేందుకు ఈ ఛారిటీ ద్వారా టాలీవుడ్ హీరోలు మేము సైతం అంటూ విరాళాలు అందజేశారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున వంటి వారు తమ వంతు సాయం చేయగా.. తాజాగా ప్రభాస్ రూ. 50 లక్షలు విరాళాన్ని ఈ ఛారిటీకి ఇచ్చాడు. కాగా, ఇప్పటికే ప్రభాస్ కరోనా వైరస్ మీద ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి గానూ రూ. 4 కోట్ల భారీ విరాళాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి చదవండి:

దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…

గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్న మరో కరోనా బాధితుడు..

కరోనాపై పద్నాలుగేళ్ల కుర్రాడు ఏడు నెలల క్రితం ఏమన్నాడంటే.?

Follow Us