Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • అమరావతి: ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ. ఎమెర్జెన్సీ పనులు నిమిత్తం తమను కంపెనీలోకి అనుమతించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎల్జీ పాలిమర్స్. రోజు వారీ కార్యకలాపాల కోసం కంపెనీలోనికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు 30 మందికి అనుమతి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పత్రం ఇవ్వలేదన్న కంపెనీ తరుపు న్యాయవాది.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • ఢిల్లీ: తబ్లిఘి జమాత్ కేసుకు సంబంధించి 294 మంది విదేశీయుల పై 15 చార్జిషీట్లను సాకేత్ కోర్టులో దాఖలు చేయనున్న ఢిల్లీ పోలీసులు.
  • ఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే అధ్యక్షత ప్రారంభమైన ఆర్మీ కమాండర్ల సమావేశం. ఆర్మీ ఫోర్స్ టాప్ కమాండర్లు ఈ సమావేశానికి హాజరు. లడఖ్లో చైనా దురాక్రమణతో సహా అన్ని భద్రతా సమస్యల పై చర్చ.
  • భారత్-చైనా సరిహద్దులకు రిజర్వు బలగాల మొహరింపు. రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన ప్రధాని, రక్షణశాఖ మంత్రి. సరిహద్దుల్లో రోడ్లు, ఇతర నిర్మాణ పనులు ఆపొద్దని ఆదేశం. సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంపై అభ్యంతరం చెబుతున్న చైనా. మరోవైపు చైనాలో విస్తృతంగా రోడ్లు, ఎయిర్‌బేస్ ల నిర్మాణం. నేడు కోర్ కమాండర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆర్మీ సమావేశం.

కరోనాపై పద్నాలుగేళ్ల కుర్రాడు ఏడు నెలల క్రితం ఏమన్నాడంటే.?

COVID 19, కరోనాపై పద్నాలుగేళ్ల కుర్రాడు ఏడు నెలల క్రితం ఏమన్నాడంటే.?

COVID 19: యావత్ ప్రపంచం మీదకు ఏదైనా విపత్తు వస్తే చాలు.. దాని గురించి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ముందే చెప్పారని.. లేదా నాస్ట్రోడామన్ చెప్పిందే జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారాలు మొదలవుతాయి. వీటిల్లో ఎక్కువగా అవాస్తవాలే ఉంటాయి కూడా. ఇదిలా ఉంటే ఓ పద్నాలుగేళ్ల కుర్రాడు ఏడు నెలల క్రితం ప్రపంచం ఎదుర్కునే విపత్కర పరిస్థితులు గురించి ముందే హెచ్చరించాడు. దీనికి గ్రహాలు, వాటి స్థితిగతుల్ని కూడా ప్రస్తావిస్తూ ఉదాహరణలతో చెప్పిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మైసూర్‌కు చెందినా అభిగ్య ఆనంద్ అనే 14 ఏళ్ల పిల్లాడు 2019, ఆగష్టు 22న తన యూట్యూబ్ ఛానల్‌లో ప్రపంచం మొత్తం నవంబర్ 2019 నుంచి ఏప్రిల్ 2020 వరకు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఈ ఆరు నెలల వ్యవధిలో ప్రపంచం ప్రాణాంతక వ్యాధి బారిన పడుతుందని.. దానితో ఆర్ధిక రంగం పూర్తిగా క్షీణిస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక 2020 మే 29 తర్వాత ఈ విపత్తు పూర్తిగా తగ్గిపోతుందంటూ ప్రతి పాయింట్ వెనుకున్న థియరీని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది.

మరోవైపు ప్రపంచ ఆర్ధిక పరిస్థితిని.. అమెరికా- యూరోప్ దేశాలు ఎదుర్కునే ఇబ్బందులను ప్రస్తావించాడు. ఇలా అతడు చెప్పిన అనేక అంశాలు ప్రస్తుతం ఎదుర్కుంటున్నవే అనే చెప్పక తప్పదు. అసలు ఆ కుర్రాడి బ్యాగ్రౌండ్ ఏంటో చూస్తే.. పదేళ్లకే అభిగ్య ఆనంద్ భగవద్గీతలోని 700 శ్లోకాల్ని అనర్గళంగా చెప్పేస్తాడు. అలాగే జోతిష్యం, ఆయుర్వేదం, వాస్తు శాస్త్రాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వేసిన టక్కున సమాధానాలు చెబుతాడు. అయుర్వేదిక్ మైక్రో బయాలజీలో పీజీ చేసిన ఆనంద్ ఫైనాన్షియల్ అస్ట్రాలజీలో పీహెచ్ డీ కూడా పూర్తి చేశాడు. కాగా, చిన్న వయసులోనే ఇంతటి అద్భుతమైన ప్రావీణ్యన్ని గుర్తించిన గుజరాత్ ప్రభుత్వం మహర్షి వేదవ్యాస అంతర్జాతీయ సంప్రదాయ వేద విశ్వవిద్యాలయం అతడ్ని ప్రొఫెసర్‌గా నియమించింది.

ఇవి చదవండి:

 దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…

గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్న మరో కరోనా బాధితుడు..

కరోనా విలయ తాండవం.. కేసుల్లో అమెరికా, మృతుల్లో ఇటలీ టాప్..

Related Tags