Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి రద్దీ కోసం 18,262 ప్రత్యేక రైళ్లు!
Indian Railways: పశ్చిమ రైల్వే పరిధిలోని ఉధ్నా స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్‌పీఎఫ్ సిబ్బంది సహాయంతో ప్రయాణికులు క్రమశిక్షణతో రైలు ఎక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు సురక్షితంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమే లక్ష్యంగా భారతీయ రైల్వే..

Indian Railways: వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి భారతీయ రైల్వే భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 18,262 ప్రత్యేక రైలు సర్వీసులను (Trips) నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రణాళికను ఆమోదించారు. ఈ మేరకు రైల్వే శాఖ తన అధికారిక ‘X’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో వివరాలను వెల్లడించింది.
ఏప్రిల్ 15 నుంచి జూలై 15 వరకు..
వేసవి సెలవుల దృష్ట్యా ఏప్రిల్ 15 నుండి జూలై 15, 2026 వరకు ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా సొంత ఊర్లకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఈ కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే 11,878 రైలు ట్రిప్పులను నోటిఫై చేయగా, మిగిలిన వాటిని విడతల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. రైలు బోగీల లభ్యతను పెంచడం, షెడ్యూలింగ్‌ను మెరుగుపరచడం ద్వారా రద్దీని నియంత్రించనున్నారు.
ఇది కూడా చదవండి: Buying Silver: వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట.. సర్వేలో షాకింగ్ నిజాలు..!
ప్రధాన నగరాలపై ప్రత్యేక దృష్టి
ఎక్కువ రద్దీ ఉండే న్యూఢిల్లీ, ముంబై (CSMT, LTT, పూణే), సూరత్, అహ్మదాబాద్, బెంగళూరు వంటి ప్రధాన స్టేషన్లలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
- రియల్ టైమ్ క్రౌడ్ మేనేజ్‌మెంట్: స్టేషన్లలో జనాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం.
- గ్రౌండ్ సపోర్ట్: ప్రయాణికులకు సహాయం చేయడానికి అదనపు సిబ్బందిని కేటాయించడం.
ఆర్పీఎఫ్ (RPF) నిఘా: రైళ్లు ఎక్కేటప్పుడు తొక్కిసలాట జరగకుండా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది క్రమ పద్ధతిలో ప్రయాణికులను గైడ్ చేస్తారు.
సురక్షిత ప్రయాణమే లక్ష్యం
పశ్చిమ రైల్వే పరిధిలోని ఉధ్నా స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్‌పీఎఫ్ సిబ్బంది సహాయంతో ప్రయాణికులు క్రమశిక్షణతో రైలు ఎక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు సురక్షితంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమే లక్ష్యంగా భారతీయ రైల్వే ఈ భారీ కసరత్తు చేస్తోంది. అందుకే ఈ వేసవిలో ప్రయాణాలను ప్లాన్ చేసుకునే వారు రైల్వే అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఈ స్పెషల్ రైళ్ల వివరాలను తనిఖీ చేసుకుని టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
Hon’ble MR Shri @AshwiniVaishnaw reviews the operation of Summer Special Trains in New Delhi, as Indian Railways plans 18,262 special train trips during the peak summer travel period to ease passenger movement and strengthen connectivity across high-demand routes.
Read more:…
— Ministry of Railways (@RailMinIndia) April 24, 2026
ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
ఇది కూడా చదవండి: Petrol: వాహనదారులకు షాకింగ్ న్యూస్.. ఇక ఆ సర్టిఫికేట్ ఉంటేనే బంకుల్లో పెట్రోల్.. లేకుంటే వెనుదిరగాల్సిందే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




