గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్న మరో కరోనా బాధితుడు..

Covid 19: నెల్లూరు యువకుడి తర్వాత విశాఖలో మూడవ కరోనా పేషెంట్(65 ఏళ్లు) కోలుకున్నాడు. ఇది ఏపీ ప్రజలకు ఊరటను ఇచ్చే అంశం. విశాఖలో అత్యధికంగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో మొదటి కరోనా రోగికి వ్యాధి నయమైంది. శనివారం, ఆదివారం చేసిన టెస్టుల్లో కరోనా నెగటివ్‌గా తేలిందని డాక్టర్లు పేర్కొన్నారు. ఇక పూర్తి నిర్ధారణ కోసం రోగి రక్త నమూనాలను పూణేలోని నేషనల్ వైరాలజీ డిపార్ట్‌మెంట్‌కు పంపించారు. అక్కడ కూడా కరోనా […]

గుడ్ న్యూస్.. ఏపీలో కోలుకున్న మరో కరోనా బాధితుడు..
Follow us

|

Updated on: Mar 30, 2020 | 9:10 AM

Covid 19: నెల్లూరు యువకుడి తర్వాత విశాఖలో మూడవ కరోనా పేషెంట్(65 ఏళ్లు) కోలుకున్నాడు. ఇది ఏపీ ప్రజలకు ఊరటను ఇచ్చే అంశం. విశాఖలో అత్యధికంగా ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో మొదటి కరోనా రోగికి వ్యాధి నయమైంది. శనివారం, ఆదివారం చేసిన టెస్టుల్లో కరోనా నెగటివ్‌గా తేలిందని డాక్టర్లు పేర్కొన్నారు. ఇక పూర్తి నిర్ధారణ కోసం రోగి రక్త నమూనాలను పూణేలోని నేషనల్ వైరాలజీ డిపార్ట్‌మెంట్‌కు పంపించారు. అక్కడ కూడా కరోనా వైరస్ నెగటివ్ తేలితే అతడ్ని డిశ్చార్జ్ చేసి 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచుతారు.

కాగా, ఇప్పటికే నెల్లూరులో నమోదైన మొదటి కరోనా బాధితుడు పూర్తిగా నయమై డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇక ఈ విశాఖ వాసితో ఏపీలో ఇద్దరు కరోనా నుంచి కోలుకున్నట్లు లెక్క. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 21 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 616 మంది శాంపిల్స్‌ను టెస్టులకు పంపించారు. అందులో 495 మంది నెగటివ్ అని తేలగా.. 100 మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉన్నాయి.

ఇవి చదవండి:

 దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…

కరోనాపై యుద్ధం.. పోలీస్‌గా మారిన క్రికెటర్.. ఐసీసీ సెల్యూట్..

కరోనా విలయ తాండవం.. కేసుల్లో అమెరికా, మృతుల్లో ఇటలీ టాప్..