కరోనా లాక్ డౌన్.. రూల్స్ అతిక్రమిస్తే కాల్చెయ్యండి..

Coronavirus Outbreak: కరోనా వైరస్ నేపధ్యంలో అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని దేశాల్లో కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రీగో లాక్ డౌన్ సమయంలో ఎవరైనా ఇబ్బందులు సృష్టిస్తే వారిని కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ‘ఇది అందరికి ఓ హెచ్చరిక.. ఇప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఈ సమయంలో గవర్నమెంట్ ఆదేశాలను ఖచ్చితంగా పాటించండి అని […]

కరోనా లాక్ డౌన్.. రూల్స్ అతిక్రమిస్తే కాల్చెయ్యండి..
Follow us

|

Updated on: Apr 02, 2020 | 11:15 PM

Coronavirus Outbreak: కరోనా వైరస్ నేపధ్యంలో అనేక దేశాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కొన్ని దేశాల్లో కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రీగో లాక్ డౌన్ సమయంలో ఎవరైనా ఇబ్బందులు సృష్టిస్తే వారిని కాల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

‘ఇది అందరికి ఓ హెచ్చరిక.. ఇప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఈ సమయంలో గవర్నమెంట్ ఆదేశాలను ఖచ్చితంగా పాటించండి అని ఆ దేశ ప్రజలకు స్పష్టం చేశారు. మరోవైపు వైద్య సిబ్బంది మీద దాడి చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

ఒకవేళ ఎవరైనా చేస్తే వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చెయ్యండని మిలిటరీ, పొలిసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కాగా గతంలో 2016లో కూడా రోడ్రీగో ఇలాంటి ఆదేశాలిచ్చారు. అటు కరోనా వైరస్ ఫిలిప్పీన్స్ దేశంలో కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 2,311 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి బారిన పడి 96 మంది మృతి చెందారు.

For More News:

మందుబాబులకు మరో షాక్.. మద్యం అమ్మకాలు ఇక లేనట్లే..

కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..

కిమ్ ఇలాకాలో.. నో కరోనా.. నిజమేనా.!

ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు.. రైల్వే శాఖ క్లారిటీ..

ఆరు వారాల చిన్నారిని మింగేసిన క‌రోనా…

లాక్ డౌన్ వేళ.. కార్లు, బైకులు వాడితే సీజ్.. పోలీసుల హెచ్చరిక..

ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్‌తో సహా ఏడుగురికి నోటిసులు..