మందుబాబులకు మరో షాక్.. మద్యం అమ్మకాలు ఇక లేనట్లే..

Coronavirus Outbreak: కరోనా వైరస్ దెబ్బకు దేశం లాక్ డౌన్ కావడంతో మందుబాబుల పరిస్థితి దారుణంగా మారింది. చుక్క పడితేనే నిద్ర పట్టని వాళ్లు.. మతిస్థిమితం కోల్పోయి పిచ్చాసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ క్రమంలోనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొన్నిషరతులతో కూడిన అనుమతులు విధిస్తూ మద్యం అమ్మకాలకు అనుమతులు ఇచ్చారు. అయితే తాజాగా దీనిపై కేరళ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. మద్యం అమ్మకాలపై మూడు వారాల పాటు స్టే విధిస్తూ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం […]

మందుబాబులకు మరో షాక్.. మద్యం అమ్మకాలు ఇక లేనట్లే..
Follow us

|

Updated on: Apr 02, 2020 | 11:16 PM

Coronavirus Outbreak: కరోనా వైరస్ దెబ్బకు దేశం లాక్ డౌన్ కావడంతో మందుబాబుల పరిస్థితి దారుణంగా మారింది. చుక్క పడితేనే నిద్ర పట్టని వాళ్లు.. మతిస్థిమితం కోల్పోయి పిచ్చాసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ క్రమంలోనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొన్నిషరతులతో కూడిన అనుమతులు విధిస్తూ మద్యం అమ్మకాలకు అనుమతులు ఇచ్చారు. అయితే తాజాగా దీనిపై కేరళ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది.

మద్యం అమ్మకాలపై మూడు వారాల పాటు స్టే విధిస్తూ ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. అలాగే తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరగకూడదని ఆదేశించింది. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం మద్యం అమ్మకాలపై నిషేదాన్ని ఎత్తివేయడం సరికాదని కేరళ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీఎస్ విజయక్రిష్ణన్, కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇక దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం మూడు వారాల స్టే విధించింది.

కాగా, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో మందుబాబులకు మందు దొరక్క పిచ్చోళ్లు అయిపోతున్నారు. కొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో మందుబాబుల సంఖ్య ఎక్కువగా ఉంది.

For More News:

కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..

కరోనా లాక్ డౌన్.. రూల్స్ అతిక్రమిస్తే కాల్చెయ్యండి..

కిమ్ ఇలాకాలో.. నో కరోనా.. నిజమేనా.!

ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు.. రైల్వే శాఖ క్లారిటీ..

ఆరు వారాల చిన్నారిని మింగేసిన క‌రోనా…

లాక్ డౌన్ వేళ.. కార్లు, బైకులు వాడితే సీజ్.. పోలీసుల హెచ్చరిక..

ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్‌తో సహా ఏడుగురికి నోటిసులు..