ఆరు వారాల చిన్నారిని మింగేసిన క‌రోనా…

Coronavirus Outbreak: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. అమెరికాలో విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో 2,15,344 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 5,112కు చేరుకుంది. అటు ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి 47 వేల మంది పైగా మృత్యువాతపడ్డారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలు కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కరోనా వైరస్ ఆరు వారాల చిన్నారిని మింగేసింది. ఇక అగ్రరాజ్యంలో ఇంత తక్కువ […]

ఆరు వారాల చిన్నారిని మింగేసిన క‌రోనా...
Follow us

|

Updated on: Apr 02, 2020 | 11:13 PM

Coronavirus Outbreak: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. అమెరికాలో విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో 2,15,344 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 5,112కు చేరుకుంది. అటు ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి 47 వేల మంది పైగా మృత్యువాతపడ్డారు.

అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలు కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కరోనా వైరస్ ఆరు వారాల చిన్నారిని మింగేసింది. ఇక అగ్రరాజ్యంలో ఇంత తక్కువ వయసు గల చిన్నారి మృతి చెందటం ఇదే తొలిసారి. అమెరికాలోని కనెక్టికట్‌కు చెందిన ఆరువారాల చిన్నారి కరోనాతో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ నెడ్ లామోంట్ తాజాగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

గతవారం కరోనా వైరస్ లక్షణాలతో అచేతన స్థితిలో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకురాగా.. కొద్దిసేపటికి వైద్యులు చిన్నారి మరణించిందని వెల్లడించారు. కాగా, వైద్య పరీక్షలు అనంతరం చిన్నారికి కరోనా వైరస్ సోకినట్లు తేలిందని వారు ధృవీకరించారు. కోవిడ్ 19 కారణంగా చిన్నారి మృతి చెందటం తీవ్రంగా కలిచివేసిందని ఆ రాష్ట్ర గవర్నర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

For More News:

మందుబాబులకు మరో షాక్.. మద్యం అమ్మకాలు ఇక లేనట్లే..

కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..

కరోనా లాక్ డౌన్.. రూల్స్ అతిక్రమిస్తే కాల్చెయ్యండి..

కిమ్ ఇలాకాలో.. నో కరోనా.. నిజమేనా.!

ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు.. రైల్వే శాఖ క్లారిటీ..

లాక్ డౌన్ వేళ.. కార్లు, బైకులు వాడితే సీజ్.. పోలీసుల హెచ్చరిక..

ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్‌తో సహా ఏడుగురికి నోటిసులు..