Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 20 వేల 903 మంది వైరస్​ సోకింది. మరో 379 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,27,439. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,79,892. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,213.
  • విజయవాడ: మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు. క్రోవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు వసంతరావు ఆచూకీ లభ్యం. గత నెల 24వ తేది అర్దరాత్రి క్రోవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు మృతి. అనంతరం మార్చూరుకి తరలించిన వైద్య సిబ్బంది. ఆసుపత్రిలో డాక్టర్లు నిర్లక్ష్యం. వృద్ధుడు వివరాలు ఆసుపత్రి రికార్డుల్లో నమోదుచేయని సిబ్బంది. దింతో మిస్టరీగా మరీనా వసంతారావు మిస్సింగ్. పోలీసుల రంగప్రవేశంతో వృద్ధుడు ఆచూకీ. గత 10 రోజులుగా కుటుంబ సభ్యులు వివరణ కోరిన సరైన వివరణ ఇవ్వని ఆసుపత్రి వర్గాలు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం తో గత 10 రోజులుగా ఆందోళనలో కుటుంబ సభ్యులు.. డాక్టర్లు తీరు పై కుటుంబ సభ్యులు ఆగ్రహం. ఆసుపత్రి సీసీ కెమెరాలలో వృద్ధుడు ఆచూకీ గమనించిన పోలీసులు. మార్చురీలో ఉన్న మృతదేహం వసంతరావుది కావడంతో విషాదంలో కుటుంబo.
  • అమరావతి: మంత్రివర్గ విస్తరణ 22న? రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్దం చేస్తునట్టు సమాచారం. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక పై కసరత్తు?
  • గుంటూరు: అరండల్ పేట పరిధిలో ప్రత్యర్దులను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఏడుగురు రౌడీ షీటర్లను అరెస్ట్ చేసిన అర్బన్ పోలీసులు. రమణ అనే వ్యక్తి ని హత్య చేసేందుకు ప్లాన్ చేసిన రౌడీ షీటర్ బసవల వాసు హత్య కేసు నిందితులు.
  • ఎయిమ్స్ నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన చిలకలూరిపేటకు చెందిన ప్రతాప్ కుమార్. వంద మార్కులకు గాను 91 మార్కులు సాధించిన ప్రతాప్ కుమార్.
  • విజయవాడ: మాజీ స్పీకర్ కోడెల కుమారుడు కోడెల శివరాంపై బెజవాడ పోలీసులకు ఫిర్యాదు. 2018లో పొలం కొనుగోలు చేసి 90 లక్షలు ఇవ్వటంలేదని పటమట పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంత్. అధికార బలంతో అప్పట్లో డబ్బు ఇవ్వలేదని, గత ఏడాది నుంచి మధ్యవర్తి రాంబాబుకి ఇచ్చేసాను అని ఇబ్బంది పెడుతున్నట్టు ఫిర్యాదు. మధ్యవర్తి రాంబాబును కలిస్తే రివాల్వర్ తో బెదిరిస్తున్నదని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంత్. గత నెల 25న ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవటంతో సీపీకి ఫిర్యాదు చేయనున్న అనంత్.
  • క్లినికల్ ట్రైల్స్ కు తెలంగాణలో గ్రీన్ సిగ్నల్ . నిమ్స్ కు పర్మిషన్ ఇచ్చిన ఐసీఎంఆర్ . ఇప్పటికే కోవిడ్ తో పాటు ఇతర వ్యాధుల వారికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్న కిమ్స్. అనేకసార్లు అనేక వ్యాధులకు వ్యాక్సిన్ ట్రైల్స్ నిర్వహించిన నిమ్స్.

Breaking: ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్‌తో సహా ఏడుగురికి నోటిసులు..

Nizamuddin Markaz, Breaking: ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్‌తో సహా ఏడుగురికి నోటిసులు..

Nizamuddin Markaz: దేశంలో కలకలం సృష్టించిన నిజాముద్దీన్ మర్కజ్ కేసులో విచారణను ఢిల్లీ క్రైం బ్రాంచ్ వేగవంతం చేసింది. లాక్‌డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వేల సంఖ్యలో సమూహాలకు ఆస్కారం కల్పించినందుకు గానూ తబ్లీఘీ-జమాత్ సంస్థ అధినేతకు, నిర్వాహకులకు ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలు ఎందుకు అతిక్రమించారో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. తబ్లీఘీ జమాత్ అధినేత మౌలానా సాద్ సహా మొత్తం ఏడుగురు నిందితుల ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించారు.

బుధవారం ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసు విభాగం ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. 1897 నాటి ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ లోని సెక్షన్ 3తో పాటు ఐపీసీలోని 269, 270, 271 మరియు 120(బీ) సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, సంస్థ అధినేత మౌలానా సాద్ సహా కీలక బాధ్యతల్లో ఉన్న జీషాన్, ముఫ్తీ షెహజాద్, యూనస్, మహమ్మద్ సల్మాన్, మహమ్మద్ అష్రఫ్‌లను నిందితులుగా పేర్కొంది. ఎవరైనా సరే ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేలా అంటువ్యాధి వ్యాప్తిచేసేలా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తే ఐపీసీ సెక్షన్ 269 ఉపయోగిస్తారు. సెక్షన్ 270 కూడా అంటువ్యాధి వ్యాప్తిచేసే చర్యలను నిర్దేశించగా, సెక్షన్ 271 క్వారంటైన్ నిబంధనలు, ఆంక్షల ఉల్లంఘన గురించి చెబుతోంది. వీటితో పాటు 120(బీ) కుట్ర కోణాన్ని నిర్వచిస్తుంది. స్థానిక పోలీసులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకుండా సమూహాలుగా ఉన్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు కేంద్రం ఈ ఘటనపై సీరియస్ అయింది. తబ్లి జమాత్‌ కార్యక్రమంలో పాల్గొన్న విదేశీయుల వీసాలను రద్దు చేస్తూ కేంద్రం హోంశాఖ ఆదేశాలను జారీ చేసింది. ఈ కార్యక్రమంలో హాజరైన 960 మంది విదేశీయుల పాస్‌పోర్టులను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పర్యాటక వీసాలపై వచ్చిన తబ్లి జమాత్‌ కార్యకలాపాలకు పాల్పడినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించడంతో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. విదేశీయుల చట్టం 1946, విపత్తు నిర్వహణ చట్టం 2005 నిబంధనలను ఉల్లంఘించినందుకు 960 మంది విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

కాగా,  లాక్‌డౌన్ కారణంగా అక్కడున్నవారు ఎటూ వెళ్లలేక ఇరుక్కుపోయారని జమాత్ నేతలు ఇప్పటివరకు చెబుతూ వస్తున్నారు. అటు కేసు నమోదైనప్పటి నుంచి జమాత్ అధినేత మౌలానా సాద్ పరారీలో ఉన్నారని ఆరోపణలు రాగా, తాను ఎటూ పారిపోలేదని, ఇంట్లోనే హోం క్వారంటైన్ అయ్యానని చెబుతూ ఓ వీడియో సందేశాన్ని సాద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి తరుణంలో క్రైం బ్రాంచ్ పోలీసుల నోటీసులకు తబ్లీఘీ జమాత్ చీఫ్ ఏం సమాధానం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.

For More News:

మందుబాబులకు మరో షాక్.. మద్యం అమ్మకాలు ఇక లేనట్లే..

కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..

కరోనా లాక్ డౌన్.. రూల్స్ అతిక్రమిస్తే కాల్చెయ్యండి..

కిమ్ ఇలాకాలో.. నో కరోనా.. నిజమేనా.!

ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు.. రైల్వే శాఖ క్లారిటీ..

ఆరు వారాల చిన్నారిని మింగేసిన క‌రోనా…

లాక్ డౌన్ వేళ.. కార్లు, బైకులు వాడితే సీజ్.. పోలీసుల హెచ్చరిక..

రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా బాధితుల సంఖ్య.. జిల్లాల వారీగా నమోదైన కేసులు ఎన్నంటే..

Related Tags