Kishan Reddy: అనుకోకుండా ఆయన సీఎం అయ్యారు.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారుః కిషన్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల్లో డబుల్‌ డిజిట్‌ సాధిస్తామని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత అనుభవాలను దృష్టిలో తాము పెద్ద టార్గెట్‌ పెట్టుకున్నామని తెలిపారు. టీవీ నైన్‌ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌ లైవ్‌షోలో కిషన్‌రెడ్డి పలు అంశాలకు సమాధానాలు ఇచ్చారు.

Kishan Reddy: అనుకోకుండా ఆయన సీఎం అయ్యారు.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారుః కిషన్ రెడ్డి
Kishan Reddy With Rajinikanth
Follow us

|

Updated on: May 10, 2024 | 9:44 PM

తెలంగాణ ఎన్నికల్లో డబుల్‌ డిజిట్‌ సాధిస్తామని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత అనుభవాలను దృష్టిలో తాము పెద్ద టార్గెట్‌ పెట్టుకున్నామని తెలిపారు. టీవీ నైన్‌ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్‌ లైవ్‌షోలో కిషన్‌రెడ్డి పలు అంశాలకు సమాధానాలు ఇచ్చారు.

ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలపై ప్రజల్లో సానుకూలత ఉందని కిషన్‌ రెడ్డి అన్నారు. అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రాబల్యం బాగా తగ్గిందని తెలిపారు. ముఖ్యనేతలు తప్ప ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు కారు పార్టీకి మద్దతుగా నిలవలేకపోతున్నారన్నారు. అటు కాంగ్రెస్‌లో కేవలం రేవంత్‌ మినహా మిగిలిన వారెవరూ ప్రచారం చేయడం లేదని కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మతకలహాలు జరుగుతాయని సీఎం రేవంత్ చేసిన ఆరోపణలను కిషన్ రెడ్డి తీవ్రం ఖండించారు. తమ పాలనలో అవి తగ్గాయని గుర్తు చేశారు.

రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ ఏనాడు వ్యతిరేకించలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాని మతం ఆధారంగా రిజర్వేషన్లు తమకు సమ్మతం కాదని తెలిపారు. మొదటి నుంచి అది తమ స్టాండ్‌ అని విస్పష్టంగా చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మాటలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని కిషన్‌రెడ్డి అన్నారు. ఏదో అనుకోకుండా ఆయన సీఎం అయ్యారని తెలిపారు. అబద్దాలు ఆడటంలో ఆయన కేసీఆర్‌ను మించిపోయారని అన్నారు.

గుజరాతీలు వచ్చి తెలంగాణకు అన్యాయం చేశారని సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణకు లాభమే తప్ప ఏనాడు అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ