హతవిధీ.. కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న 12 ఏళ్ల బాలిక.. కడుపులో రంధ్రం

చిన్న పిల్లలు తరచుగా కొత్తదాన్ని చూసినప్పుడు దానిని ప్రయత్నించాలనుకునే ఆసక్తిని కలిగి ఉంటారు. అయితే మార్కెట్‌లో లభించేవన్నీ చిన్న పిల్లలకు.. వారి ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయని మర్చిపోతున్నారు తల్లిదండ్రులు కూడా. వాస్తవానికి ఇటీవల 12 ఏళ్ల అమ్మాయి స్మోకీ పాన్ తిన్న తర్వాత.. జరిగిన సంఘటన తెలిస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. అంతేకాదు ఈ విషయం తెలిసిన తర్వాత మళ్లీ నైట్రోజన్ పాన్ తినాలని అనుకోరు. మరి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం..

హతవిధీ.. కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న 12 ఏళ్ల బాలిక.. కడుపులో రంధ్రం
Nitrogen Paan
Follow us
Surya Kala

|

Updated on: May 20, 2024 | 8:40 PM

ప్రస్తుతం కూల్‌గా కనిపించేందుకు రకరకాల ట్రెండ్స్‌ ఫాలో అవుతున్నారు. వీటిలో ఒకటి స్మోకీ పాన్ ట్రెండ్. దీనిని ప్రజలు నైట్రోజన్ పాన్ అని కూడా పిలుస్తారు. ఈ స్మోకీ పాన్‌లను ఏదైనా మాల్ లేదా పాన్ షాప్‌లో సులభంగా దొరుకుతాయి. వాస్తవానికి.. స్మోకీ పాన్ ఒక రకమైన హానికరమైన రసాయన నైట్రోజన్ సహాయంతో తయారు చేస్తారు. ఈ స్మోకీ పాన్ ఆరోగ్యానికి హానికరం అవుతుంది.

నైట్రోజన్ అనేది ఒక రకమైన వాయువు. ఇది ద్రవంగా మార్చబడుతుంది. 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడుతుంది. దీని కారణంగా ద్రవ నత్రజని వేగంగా ఆవిరైపోతుంది. పొగ రావడం ప్రారంభమవుతుంది. ప్రజలు దీనిని చూడడానికి బాగుంది అని అనుకుంటారు.. అందుకే కొందరు కొత్త ప్రదేశాలకు వెళ్లి ప్రయత్నించి వీడియోలు కూడా చేస్తారు. ద్రవ నైట్రోజన్‌లో నిల్వ చేసిన పాన్‌ను తినే ట్రెండ్ ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందింది.

చిన్న పిల్లలు తరచుగా కొత్తదాన్ని చూసినప్పుడు దానిని ప్రయత్నించాలనుకునే ఆసక్తిని కలిగి ఉంటారు. అయితే మార్కెట్‌లో లభించేవన్నీ చిన్న పిల్లలకు.. వారి ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయని మర్చిపోతున్నారు తల్లిదండ్రులు కూడా. వాస్తవానికి ఇటీవల 12 ఏళ్ల అమ్మాయి స్మోకీ పాన్ తిన్న తర్వాత.. జరిగిన సంఘటన తెలిస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. అంతేకాదు ఈ విషయం తెలిసిన తర్వాత మళ్లీ నైట్రోజన్ పాన్ తినాలని అనుకోరు. మరి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

నైట్రోజన్ పాన్ విషయం ఏమిటి? స్మోకీ పాన్ తిన్న ఓ చిన్నారికి కడుపులో రంధ్రం పడిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. నివేదికల ప్రకారం బాలిక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. కడుపులో రంధ్రం అనే అర్థం వచ్చే పెర్ఫోరేటెడ్ పెరిటోనిటిస్ అనే వ్యాధి బారిన బాలిక పడినట్లు నివేదికలో వెల్లడైంది. వైద్యులు శస్త్రచికిత్స ద్వారా దానిని నయం చేశారు. ఆరు రోజుల తర్వాత బాలికను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

విషయం మొత్తం చెప్పిన బాలిక మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తాను ఒక పెళ్లికి వెళ్లానని అక్కడ కొంతమంది ఈ స్మోకీ పాన్ తినడం చూశానని అమ్మాయి చెప్పింది. అందరినీ చూసి ఈ పాన్ ని కూడా ట్రై చేద్దాం అనుకున్నట్లు చెప్పింది. తీవ్ర అనారోగ్య బారిన పడిన బాలికను ఆసుపత్రిలో చేర్పించారు. ఆపై ఈ నైట్రోజన్ పాన్ తినడం వల్ల కడుపులో రంధ్రం ఏర్పడిందని.. బాలిక భరించలేని నొప్పితో ఇబ్బంది పడినట్లు తెలిసింది.

ద్రవ నత్రజని అంటే ఏమిటి? ప్యాక్ చేసిన ఆహారం నాణ్యత, షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి.. లండన్ కంపెనీ ద్రవ నైట్రోజన్‌ను సృష్టించింది. లిక్విడ్ నైట్రోజన్ సహాయంతో కాఫీ, పొటాటో చిప్స్, వేరుశెనగలు, వెన్న మొదలైన వాటిని నెలల తరబడి తాజాగా ఉంచుతుంది. ప్రస్తుతం కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి చాలా రెస్టారెంట్లు ద్రవ నైట్రోజన్‌ని ఉపయోగించి వంటలను ఫ్యాన్సీగా తయారు చేయడం ప్రారంభించాయి. ఈ వంటకాలు ఎంత ఫ్యాన్సీగా కనిపించినా.. వాస్తవానికి అవి ఆరోగ్యానికి హానికరం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..