AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లని వెదర్.. ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ఎండలు దంచి కొట్టగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో కూల్‌ వాతావరణం నెలకొంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వాతావరణ శాఖ మరో చల్లని కబురు చెప్పింది. ఏపీలో రెండు రోజులపాటు..

తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లని వెదర్.. ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.!
Rain Alert
Ravi Kiran
|

Updated on: May 10, 2024 | 9:41 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ఎండలు దంచి కొట్టగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో కూల్‌ వాతావరణం నెలకొంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వాతావరణ శాఖ మరో చల్లని కబురు చెప్పింది. ఏపీలో రెండు రోజులపాటు.. తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడులో ఏర్పడిన ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాలపై బలంగా విస్తరించిందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో.. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ.

ఇప్పటికే.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో ఉరుములు- మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో రేకుల షెడ్లు ధ్వంసం అయ్యాయి. అటు.. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే.. గత నెల రోజులుగా మండే ఎండలు, ఉక్కపోత నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కాస్త ఉపశమనం లభించింది.

ఇక.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరోసారి వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, నిజాంపేట్‌, కుత్బుల్లాపూర్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌లో వర్షం పడింది. హైదరాబాద్‌లో ఉదయం నుంచే వాతావరణం చల్లబడి ఉంది. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ నగరంలో అకస్మాత్తుగా వర్షం బీభత్సం సృష్టించింది. మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్‌ఎంసీ అలెర్ట్‌ అయింది.

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..