కరోనాపై పోరుకు.. ‘ఆరోగ్య సేతు’ ట్రాకింగ్ యాప్.. ఎలా పని చేస్తుందంటే.?
Coronavirus Outbreak: ఇండియాలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2301 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే కరోనా ఎవరికి సోకిందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తాజాగా నమోదైన కేసుల్లో కొందరికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. దీనితో కేంద్రం ఓ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. కరోనాను దరి చేరకుండా ఉండేందుకు, ఆ వ్యాధి సోకినవారు దగ్గరకు వస్తే గుర్తించేందుకు వీలుగా కేంద్రం […]

Coronavirus Outbreak: ఇండియాలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2301 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే కరోనా ఎవరికి సోకిందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే తాజాగా నమోదైన కేసుల్లో కొందరికి ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. దీనితో కేంద్రం ఓ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. కరోనాను దరి చేరకుండా ఉండేందుకు, ఆ వ్యాధి సోకినవారు దగ్గరకు వస్తే గుర్తించేందుకు వీలుగా కేంద్రం ప్రభుత్వం శుక్రవారం ఓ యాప్‌ను రూపొందించింది. ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను రూపకల్పన చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
‘ఆరోగ్య సేతు’ యాప్ గురించి మరిన్ని విషయాలు…
- ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో, ఐఫోన్ ఉపయోగించేవారు యాప్ స్టోర్‌లలో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత పేరు, మొబైల్ నెంబర్‌తో రిజిస్టార్ చేసుకోవాలి.
- మన ఆరోగ్య విషయాలు, ఇతర ఆధారాలను నమోదు చేయాలి.
- అంతేకాక జీపీఎస్, బ్లూటూత్‌లను కూడా ఆన్ చేసుకోవాలి.
- ప్రస్తుతం ఈ యాప్ 11 బాషలలో అందుబాటులో ఉంది.
- ఈ యాప్ అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా పని చేస్తుంది.
ప్రయోజనాలు…
- దేశంలో కరోనా కేసుల రిపోర్టు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
- కరోనాను దరి చేరనివ్వదు.
- కరోనా వైరస్ ఉన్న వ్యక్తి దగ్గరకు మీరు వెళ్తే యాప్ తక్షణమే మీ లొకేషన్ స్కాన్ చేసి.. మీ డేటాను ప్రభుత్వానికి చేరవేస్తుంది.
- కోవిడ్ 19 లక్షణాలు ఉన్నా.. వాటిని నిర్ధారించేందుకు ప్రత్యేకమైన చాట్‌బోట్ ఉంటుంది.
ఇది చదవండి: కరోనా వారియర్స్‌కు పేటీఎం చేయూత.. 60 హోటళ్లలలో బస..