ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో వైద్యుడి నిర్వాకం.. ఢిల్లీ వెళ్లి వచ్చి ఇలా చేయడమా..?

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రజలంతా కఠినంగా లాక్‌డౌన్ పాటిస్తే.. త్వరగా ఈ మహమ్మారిని దేశం నుంచి తరిమేయొచ్చని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటుగా.. ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ మీటింగ్‌లకు హాజరైన వారు కూడా.. క్వారంటైన్‌లో ఉంటూ.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ […]

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో వైద్యుడి నిర్వాకం.. ఢిల్లీ వెళ్లి వచ్చి ఇలా చేయడమా..?
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 3:17 PM

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రజలంతా కఠినంగా లాక్‌డౌన్ పాటిస్తే.. త్వరగా ఈ మహమ్మారిని దేశం నుంచి తరిమేయొచ్చని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటుగా.. ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ మీటింగ్‌లకు హాజరైన వారు కూడా.. క్వారంటైన్‌లో ఉంటూ.. కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ విషయంలో అందరికీ జాగ్రత్తలు చెప్పాల్సిన ఓ వైద్యుడు.. అందకు విరుద్దంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ వైద్యుడు ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్‌ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తనంతట తానే.. క్వారంటైన్‌లో ఉండాల్సిన అతను.. అలా చేయకుండా.. ఐసోలేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇన్ని రోజులు క్వారంటైన్ కేంద్రంకు వెళ్లకుండా.. ఈ విషయాన్ని దాచిపెట్టి డ్యూటీ చేయడంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. వైద్యుడే ఇలా చేయడమేంటని.. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.