కేంద్రం ప్రకటన.. ఏప్రిల్ 14 జాతీయ సెలవు దినం..

కేంద్రం ప్రకటన.. ఏప్రిల్ 14 జాతీయ సెలవు దినం..

Coronavirus Outbreak: ఏప్రిల్ 14.. ఇప్పుడు ఈ తేదీకి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో భాగంగా కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ముగిసే చివరి తేది ఇదే. రోజూ బిజీబిజీగా తిరిగే వాళ్లకు ఈ లాక్ డౌన్ సరికొత్త అనుభవాన్ని మిగిలిస్తుందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. లాక్ డౌన్ ముగిసే ఏప్రిల్ 14ను అధికారిక సెలవు దినంగా ప్రకటిస్తూ […]

Ravi Kiran

|

Apr 10, 2020 | 2:41 PM

Coronavirus Outbreak: ఏప్రిల్ 14.. ఇప్పుడు ఈ తేదీకి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో భాగంగా కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ముగిసే చివరి తేది ఇదే. రోజూ బిజీబిజీగా తిరిగే వాళ్లకు ఈ లాక్ డౌన్ సరికొత్త అనుభవాన్ని మిగిలిస్తుందని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. లాక్ డౌన్ ముగిసే ఏప్రిల్ 14ను అధికారిక సెలవు దినంగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే.. ఆ రోజు రాజ్యాంగ సృష్టికర్త బీఆర్ అంబేడ్కర్ జయంతి కావడంతో.. కేంద్రం సెలవుగా ప్రకటించింది.

మరోవైపు దేశవ్యాప్త లాక్ డౌన్‌ను పొడిగిస్తారా.? లేదా ఆంక్షలతో కూడిన సడలింపులతో ఎత్తివేస్తారా.? అన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో.. అది మూడో దశకు చేరుకోకుండా మరికొన్ని రోజులు లాక్ డౌన్ విధించాలని కొంతమంది రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అటు మోదీ కూడా పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేసే ఛాన్సులు లేవని చుచాయిగా చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్ని రోజుల వరకు లాక్ డౌన్ పొడిగించాలన్న విషయాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయమ్మ్లో లాక్ డౌన్ చివరి తేదీ ఏప్రిల్ 14న జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.

ఇవి చదవండి:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఓలా సర్వీసులకు గ్రీన్ సిగ్నల్..

సీఎం సంచలనం.. డాక్టర్లు, నర్సులకు డబుల్ శాలరీ..

ఏపీలో కరోనా రోగులకు పౌష్టికాహారం.. ఆరోగ్య ఆంధ్రా ట్వీట్ వైరల్..

దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. మొదటి స్థానం, చివరి స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఇవే..

జూలైలో ఐపీఎల్.. కొత్త తేదీలు ఫిక్స్.?

తీరు మారని పాకిస్థాన్.. కరోనా భయంతో డాక్టర్లపై లాఠీచార్జ్..

ఏపీ తాజా హెల్త్ బులిటెన్.. తగ్గుతోన్న కరోనా కేసులు..

కేంద్రం కీలక నిర్ణయం.. పెరగనున్న అబార్షన్ల సంఖ్య.!

ఏప్రిల్ 15 నుంచి రైల్ జర్నీ.. కండీషన్స్ అప్లై..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu