AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Corona Cases: బుసలు కొడుతున్న కరోనా.. ఏపీలో ఉగ్రరూపం.. పెరిగిపోయిన పాజిటివిటీ రేటు..

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కోవిడ్ రక్కసి కోరలు చాస్తోంది. కరోనా తాచు బుసలు కొడుతోంది. నిన్న ఒక్కరోజే పదివేల మార్క్ దాటేసింది.  గత 24 గంటల్లో 10,057 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి..

AP Corona Cases: బుసలు కొడుతున్న కరోనా.. ఏపీలో ఉగ్రరూపం.. పెరిగిపోయిన పాజిటివిటీ రేటు..
Sanjay Kasula
|

Updated on: Jan 20, 2022 | 8:35 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కోవిడ్ రక్కసి కోరలు చాస్తోంది. కరోనా తాచు బుసలు కొడుతోంది. నిన్న ఒక్కరోజే పదివేల మార్క్ దాటేసింది.  గత 24 గంటల్లో 10,057 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా  ఎనిమిది మంది బలి తీసుకుంది. మంగళవారం ఉదయం 9నుంచి బుధవారం ఉదయం 9గంటల మధ్య 41,713 నమూనాలను పరీక్షించాగా.. పాజిటివిటీ రేటు 24.1% నమోదైంది. అంటే పరీక్షించిన ప్రతి వంద నమూనాల్లో 24 కేసులు వెలుగు చూశాయి. గతేడాది జూన్‌ ఐదో తేదీ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గతేడాది అక్టోబరు 27 తర్వాత ఎనిమిది మరణాలు నమోదవడం ఇదే తొలిసారి.. అంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

జనవరి రెండు, మూడు వారాల్లో కేసుల రేటు పెరుగుతుందని ముందు నుంచి హెచ్చరిస్తున్నా.. పట్టుకుంటేనేవారు.. వినేవారు లేకపోవడంతో కొవిడ్‌ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. జనవరి ఒకటిన పాజిటివిటీ రేటు 0.57%గా నమోదవగా.. అదే 10వ తేదీ రోజు వరకు 4.05%, 15న 13.89%గా నమోదైంది. మంగళవారం 6,996 నమోదుకాగా పాజిటివిటీ రేటు 22.67%గా చేరుకుంది. గత 19 రోజుల్లో ఈ పాజిటివ్ రేటు అమాంతం పెరిగిపోయింది.

ఇక జిల్లాలవారీగా పరిశీలిస్తే కరోనా పాజిటివ్ రేటు చిత్తూరు, విశాఖ జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 1827 కేసులు రాగా, విశాఖ జిల్లాల్లో 1822 కేసులొచ్చాయి. ఆ తర్వాత స్థానంలో గుంటూరు 943, తూర్పుగోదావరి 919, అనంతపురం 861, కడప 482, కృష్ణా 332, కర్నూలు 452, నెల్లూరు 698, ప్రకాశం 716, శ్రీకాకుళం 407, విజయనగరం 382, పశ్చిమగోదావరి జిల్లాలో 216 చొప్పున కేసులొచ్చాయి. కొవిడ్‌ కారణంగా విశాఖ జిల్లాలో ముగ్గురు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు విడిచారు.

నిర్లక్ష్యం.. నిర్లిప్తత..

తమకు సంబంధం లేదన్నట్లుగా.. ఈ వ్యవహారం తమది కాదన్నట్లుగా.. నిమ్మకు నీరెత్తినట్లుగా మొద్దు నిద్రలో జోగుతున్న అధికారులకు ఇవన్నీ పట్టడం లేదు. ప్రజలకు కోవిడ్‌పై అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో వైద్యారోగ్య శాఖ అధికారులు విఫలమవుతున్నారు. ముఖ్యమంత్రి కోవిడ్ వ్యాప్తిపై రివ్యూ చేస్తే గానీ రాష్ట్రస్థాయి అధికారులు బయటకు రావడం లేదు. కేవలం కేసుల సంఖ్యపై ప్రెస్ నోట్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. సీఎం చెప్పినా కూడా ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా పెట్టని అధికారులు. తమకు సోకింది కరోనా.. లేక ఒమిక్రాన్.. ఏది సోకిందో తెలియక అల్లాడిపోతున్నారు జనం.

దోపిడీకి తెరలేపిన..

అంతే కాదు.. ఆర్తీఏపీసీఆర్ టెస్ట్ లకు భారీగా డబ్బులు దోచుకుంటున్నాయి ప్రైవేటు డయాగ్నొస్టిక్‌ ల్యాబ్‌లు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష ధర రూ.350 తీసుకోవాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. అయినప్పటికీ.. కొవిడ్‌ నిర్ధారణ (ఆర్టీపీసీఆర్‌) పరీక్ష ధరను ఐసీఎంఆర్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో చేసే ఈ పరీక్షకు రూ.350 మాత్రమే వసూలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులిచ్చింది. పరీక్ష కోసం ఇప్పటివరకు రూ.475కు పైగా వసులు చేస్తున్నారు. నిర్ణీత ధరను మించి వసూలు చేయకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: Budget 2022: సామాన్యుల జీవన చక్రం.. పరుగుల బండిపై నిర్మలమ్మ నజర్.. రైల్వేపై ఎలా..

Black Diamond: దుబాయ్‌లో అతి పెద్ద నల్ల వజ్రం ఆవిష్కారం.. ఈ బ్లాక్ డైమండ్‌ చాలా స్పెషాల్..