అర్హులైన వారికి ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు: మంత్రి బొత్స

లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

అర్హులైన వారికి ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు: మంత్రి బొత్స
Follow us

| Edited By:

Updated on: Apr 14, 2020 | 7:44 PM

లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసరాల కోసం ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బియ్యం ఇచ్చే ప్రతి కార్డుకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలనదే ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. రేషన్‌ సరకుల పంపిణీలో ఇబ్బందులను అధిగమించేలా చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా బొత్స పేర్కొన్నారు. ప్రస్తుతం వేసవి దృష్ట్యా రేషన్ దుకాణాల వద్ద టెంట్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని బొత్స వెల్లడించారు.

ఓ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని సీఎం జగన్ ఆదేశించారని బొత్స అన్నారు. అర్హులైన వారికి రేషన్‌ కార్డు కావాలంటే.. 5 రోజుల్లో మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రూ.వెయ్యి నగదు సాయం అందని వారికి త్వరలోనే అందజేస్తామని బొత్స తెలిపారు.

Read This Story Also: శ్రియ భర్తకు కరోనా లక్షణాలు.. ఆసుపత్రిలో వద్దన్న డాక్టర్లు..!