దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు..తాజా వివరాలు ఇవే..

ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. ఇప్పటి వరకు 22లక్షల మందికి పైగా కరోనా పాజిటివ్ సోకగా.. ఇందులో లక్ష యాభై వేలమంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ మహమ్మారి మన దేశంలో కూడా విజృంభిస్తోంది. శనివారం సాయంత్రం 5.00గంటల వరకు.. దేశ వ్యాప్తంగా 14,792 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారితో పోరాడి.. 2015 ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇక […]

Follow us

| Edited By:

Updated on: Apr 18, 2020 | 9:38 PM

ప్రపంచ దేశాలన్నింటిని కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. ఇప్పటి వరకు 22లక్షల మందికి పైగా కరోనా పాజిటివ్ సోకగా.. ఇందులో లక్ష యాభై వేలమంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ మహమ్మారి మన దేశంలో కూడా విజృంభిస్తోంది. శనివారం సాయంత్రం 5.00గంటల వరకు.. దేశ వ్యాప్తంగా 14,792 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారితో పోరాడి.. 2015 ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 488 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. కాగా.. గడిచిన 24గంటల్లో.. 957 కొత్త పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 248 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక మరో 36 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో మూడువేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఢిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కరోనా కేసుల సంఖ్య నమోదయ్యాయి.

Latest Articles