“నెక్ట్స్ ఇయ‌ర్ కాదు.. ఈ సెప్టెంబర్‌లోనే కరోనా వ్యాక్సిన్ రెడీ”

నెక్ట్స్ ఇయ‌ర్ కాదు.. ఈ సెప్టెంబర్‌లోనే కరోనా వ్యాక్సిన్ రెడీ

ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న ఫ‌లితాలు అనుకున్న‌ట్టు జరిగితే సెప్టెంబర్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు బ్రిటన్ ఫేమ‌స్ సైంటిస్ట్ శారా గిల్బర్ట్. ఆక్సఫర్డ్ యూనివర్సీటికి చెందిన శారా.. త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి వ్యాక్సిన్ త‌యారుచేయడానికి అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. రాబోయే ప‌క్షం రోజుల్లో ఈ వ్యాక్సిన్‌ను హ్యూమ‌న్స్ పై టెస్టు చేయ‌బోతున్నారు. ‘నేను 80 శాతం న‌మ్మ‌కంతో ఉన్నా.. సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ రెడీ అవ్వొచ్చు. ఇప్పటి వరకూ వ‌చ్చిన ఫ‌లితాలు ఇవే సూచిస్తున్నాయి. ఇది నా పర్స‌న‌ల్ […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Apr 11, 2020 | 10:09 PM

ప్ర‌స్తుతం జ‌రుగుతోన్న ఫ‌లితాలు అనుకున్న‌ట్టు జరిగితే సెప్టెంబర్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు బ్రిటన్ ఫేమ‌స్ సైంటిస్ట్ శారా గిల్బర్ట్. ఆక్సఫర్డ్ యూనివర్సీటికి చెందిన శారా.. త‌న స‌హ‌చ‌రుల‌తో క‌లిసి వ్యాక్సిన్ త‌యారుచేయడానికి అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. రాబోయే ప‌క్షం రోజుల్లో ఈ వ్యాక్సిన్‌ను హ్యూమ‌న్స్ పై టెస్టు చేయ‌బోతున్నారు. ‘నేను 80 శాతం న‌మ్మ‌కంతో ఉన్నా.. సెప్టెంబర్ నాటికి వ్యాక్సిన్ రెడీ అవ్వొచ్చు. ఇప్పటి వరకూ వ‌చ్చిన ఫ‌లితాలు ఇవే సూచిస్తున్నాయి. ఇది నా పర్స‌న‌ల్ ఒపెనియ‌న్’ అని శారా గిల్బర్ట్ వ్యాఖ్యానించారు.

కాగా క‌రోనాకు వ్యాక్సిన త‌యారు చేసేందుకు ప్ర‌పంచవ్యాప్తంగా అనేక సంస్థ‌లు ప‌నిచేస్తున్నాయి. అయితే ఎక్కువ‌మంది నిపుణులు మాత్రం వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చేందుకు 12 నుంచి 18 నెల‌లు ప‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్టు చెప్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు సారా చేసిన కామెంట్స్ సంచ‌ల‌నంగా మారాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu