Corona New Variant: ప్రపంచాన్ని కల్లోల పరుస్తున్న కరోనా కొత్త రూపం.. ఇది డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమా?

కరోనావైరస్ కొత్త వేరియంట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వాతావరణం నెలకొంది. కొత్త వేరియంట్ B.1.1.529 కరోనా వైరస్ అసలు రూపానికి భిన్నమైన స్పైక్ ప్రోటీన్‌ని కలిగి ఉందని యూకే నుంచి వచ్చిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Corona New Variant: ప్రపంచాన్ని కల్లోల పరుస్తున్న కరోనా కొత్త రూపం.. ఇది డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమా?
Coronavirus
Follow us

|

Updated on: Nov 27, 2021 | 8:45 AM

Corona New Variant: కరోనావైరస్ కొత్త వేరియంట్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వాతావరణం నెలకొంది. కొత్త వేరియంట్ B.1.1.529 కరోనా వైరస్ అసలు రూపానికి భిన్నమైన స్పైక్ ప్రోటీన్‌ని కలిగి ఉందని యూకే నుంచి వచ్చిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. డెల్టా వేరియంట్ కంటే కూడా ఈ కొత్త వేరియంట్‌లో మ్యుటేషన్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. యూకే నుంచి వచ్చిన ఈ నివేదిక తరువాత కరోనా కొత్త అవతారంపై ఎన్నో భయాలు మొదలయ్యాయి. ముఖ్యంగా దీనిపై టీకా ప్రభావం ఎంతవరకూ ఉంటుంది అనేది అందరిలోనూ తలెత్తుతున్న సందేహం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతవరకూ ఈ కొత్త కరోనా రూపం పాకి ఉంటుంది అనే అనుమానమూ పీడిస్తోంది. ఇటువంటి ఎన్నో అనుమానాలు.. భయాలు.. ఇప్పడు ప్రజల్లో నెలకొని ఉన్నాయి. మరి వీటికి నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారు? కరోనా కొత్త వేరియంట్ పై వారు ఏమంటున్నారు తెలుసుకుందాం.

ఎవరికీ సోకే అవకాశం ఉంది?

సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ జుగల్ కిషోర్ ఈ విషయంపై మాట్లాడుతూ, ”కరోనా వైరస్ తన రూపాన్ని నిరంతరం మార్చుకుంటూనే ఉంటుంది. దీని వల్ల కొత్త వేరియంట్‌లు వస్తున్నాయి. భారతదేశంలో ఈ రూపాంతరం గురించి పెద్దగా ఆందోళన లేనప్పటికీ, దీని నుండి ఎప్పుడూ ప్రమాదం పోంచే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం దేశంలో గతంలో చాలా మంది ప్రజలు కరోనా బారిన పడటమే. ఇక మనదేశంలో టీకాలు వేయడం వేగంగా జరుగుతోంది. దీని నుండి యాంటీబాడీస్ తయారు అవుతున్నాయి. ఈ పరిస్థితిలో మన దేశంలో కూడా ఈ కొత్త తెగులు వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. అయితే, ఇంకా టీకాలు వేయని లేదా వ్యాధి సోకని వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవడం చాలా ముఖ్యం” అని చెప్పారు.

ఈ వేరియంట్ డెల్టా కంటే ప్రమాదకరంగా ఉంటుందా

ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లోని మెడిసిన్ విభాగం అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ నీరజ్ నిశ్చల్ మాట్లాడుతూ, ప్రస్తుతానికి ఈ కొత్త కరోనా జాతి గురించి ఏదైనా చెప్పడం చాలా తొందరపాటు అవుతుంది. ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో విస్తరించిందో చూడాలి. అక్కడ కేసులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో.. ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య ఎలా పెరుగుతుందో అధ్యయనం చేయాల్సి ఉంది. సాధారణంగా కొత్త జాతి కారణంగా ఎక్కువ మరణాలు సంభవిస్తే.. ఆసుపత్రులలో రోగుల సంఖ్య పెరిగితే, ఈ జాతి చాలా ప్రాణాంతకం అని అర్థం. దీనితో పాటు, ప్రజలు వ్యాక్సిన్ పొందిన ప్రాంతాలలో పరిస్థితి కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అక్కడ ఈ వేరియంట్ ఎలా ప్రవర్తిస్తోందనేది తెలుసుకోవాల్సిఉంటుంది. అందువల్ల, ఈ రూపాంతరం డెల్టా కంటే ప్రమాదకరమైనదిగా మారుతుందా లేదా అనే విషయం తేలాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే అని చెప్పారు.

నిపుణుల సూచనలు ఇవీ..

వైరస్ జాతి ఏదైనా కావచ్చు కానీ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే అని డాక్టర్ నీరజ్ చెప్పారు. ప్రజలు కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించడమే దీనిని నివారించే మార్గం. ఇలా చేయడం ద్వారా, కరోనా ఏదైనా జాతి బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. అదేవిధంగా ఈ అంటువ్యాధి నియంత్రణలో ఉంటుంది. అందువల్ల, తమను తాము చూసుకునే వారు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని నిమిత్తం దేశం నుంచి వెళ్లాలనుకునే వారు కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి.

ట్రేసింగ్ కూడా పెరగాల్సి ఉంటుంది

ఏదైనా కొత్త వేరియంట్‌ను గుర్తించాలంటే, ట్రేసింగ్‌ను పెంచడం చాలా ముఖ్యమైన విషయం అని డాక్టర్ నీరజ్ చెప్పారు. మరింత మందికి కోవిడ్ టెస్ట్ లు జరగాలి. అలాగే కరోనా సోకిన వారి టెస్టింగ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపాలి. దీనితో, సోకిన వారిలో కొత్త జాతి ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. దాని ద్వారా కొత్త వేరియంట్ సోకినా వారిని సకాలంలో వేరు చేయవచ్చు. ఇది వ్యాధి వేగంగా వ్యాప్తి చెందకుండా ఆపుతుంది.

మార్గదర్శకాలను విడుదల చేసిన భారత్..

ఈ వేరియంట్‌ను దృష్టిలో ఉంచుకుని, దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్వానా నుండి వచ్చే వ్యక్తులను ఖచ్చితంగా తనిఖీ చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. సూచనల ప్రకారం, ఈ దేశాల ప్రయాణికులతో పరిచయం ఉన్న వ్యక్తులందరినీ నిశితంగా ట్రాక్ చేయాలి. గుర్తించాలి. వారికి పరీక్షలు చేయాలి. కరోనా కొత్త వేరియంట్ దృష్ట్యా, బ్రిటన్ ఆఫ్రికాలోని ఆరు దేశాలకు భారత్ విమానాలను నిషేధించింది.

ఇవి కూడా చదవండి: Tomato Price: దక్షిణాదిలో కాస్త తగ్గిన టమాటా ధర.. అక్కడ మాత్రం అదిరిపోయే రేంజిలోనే.. ఎక్కడ ఎంత రేటు ఉందంటే.. 

Mental Health: మీ వ్యవహార శైలిలో ఈ మార్పులు కనిపిస్తుంటే మీ మానసిక ఆరోగ్యం పాడైనట్టే..వెంటనే నిపుణులను సంప్రదించాల్సిందే!

Sensex: వారాంతంలో మదుపర్లకు బిగ్ షాక్.. భారీగా పడిపోయిన సెన్సెక్స్.. కారణాలు ఇవే..

Latest Articles