హైదరాబాద్‌లో కంటైన్మెంట్ జోన్లు ఇవే…జాబితా విడుదల చేసిన సర్కార్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మార్క్‌ను దాటేశాయి కేసుల సంఖ్య. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో తాజా కంటైన్మెంట్ జోన్ల జాబితాను విడుదల చేసింది ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మార్క్‌ను దాటేశాయి కేసుల సంఖ్య. మరోవైపు, రాష్ట్రంలో కరోనా వైరస్ కమ్యునిటీలోకి వెళ్లిందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఇకపై ప్రతీ ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే నాలుగు, ఐదు వారాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే కరోనా కట్టడి సాధ్యం కాదన్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో తాజా కంటైన్మెంట్ జోన్ల జాబితాను విడుదల చేసింది ప్రభుత్వం.
తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,640 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 52,466కి చేరింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో వైరస్ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దీంతో గ్రేటర్ సిటీలో 2,902 కంటైన్మెంట్ హోమ్ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కంటైన్మెంట్ క్లస్టర్ల వద్ద బారి కేడ్ల ఏర్పాటును తీసేసిన అధికారులు..హోమ్ క్లస్టర్స్ గా ఉన్న ఇళ్లకు కేవలం గుర్తింపు స్టిక్కర్లు ఏర్పాటు చేశారు. హోమ్ క్లస్టర్స్ లో 12, 026 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. 507 మందిని హోమ్ ఐసోలేషన్ లో నుండి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇంటింటి చికిత్సలో ఎక్కువ మంది వృద్ధులు, చిన్నపిల్లలు, 60ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారు 9983 మందిని గుర్తించినట్లుగా తెలిపారు. ఏళ్ల లోపు చిన్నారులు 9443 ఉన్నట్లుగా చెప్పారు.




