ఈ రోజు నుంచి రేప‌ల్లెలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

గుంటూరు జిల్లాలో మొదటి నుంచీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే న‌మోద‌వుతున్నాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ రేప‌ల్లె మాత్రం గ్రీన్ జోన్‌గా ఉంది. కానీ రేప‌ల్లెలో కూడా కేసుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో.. ఈ రోజు నుంచి ఈ ప్రాంతంలో సంపూర్ణ లాక్‌డౌన్..

  • Tv9 Telugu
  • Publish Date - 2:43 pm, Sun, 16 August 20
ఈ రోజు నుంచి రేప‌ల్లెలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌
Janata Curfew Anniversary

Complete lockdown at Repalle: ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోతున్నాయి. ఇప్ప‌టికే ఏపీలో 2.81 ల‌క్ష‌ల‌కు పైగానే కేసులు నమోద‌య్యాయి. ఇప్ప‌టికే ఎంతో మంది ప్రముఖులు, సెల‌బ్రిటీలు కూడా ఈ కోవిడ్ బారిన ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ ప‌లు ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమ‌లు ప‌రుస్తోంది ఏపీ ప్ర‌భుత్వం. అందులోనూ గుంటూరు జిల్లాలో మొదటి నుంచీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే న‌మోద‌వుతున్నాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ రేప‌ల్లె మాత్రం గ్రీన్ జోన్‌గా ఉంది. కానీ రేప‌ల్లెలో కూడా కేసుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో.. ఈ రోజు నుంచి ఈ ప్రాంతంలో సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లు ప‌రుస్తున్నారు అధికారులు. ఉద‌యం 6 గంటల నుండి ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే వ్యాపారుల‌కు మిన‌హాయింపు ఉంటుంద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. అత్య‌వ‌స‌ర‌మ‌తే త‌ప్పించి ప్ర‌జ‌లెవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేశారు అధికారులు.

Read More: 

వెద‌ర్ వార్నింగ్ః తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

ఏపీః మండ‌పేట ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటివ్‌