తెలంగాణ: కరోనా బాధితులకు ప్రత్యేక ఎగ్జామ్ సెంటర్లు.. చివరి రోజు ఎంసెట్.!
ఎంసెట్‌తో పాటు ఇతర ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్ధులకు...
Last Day Eamcet For Corona Students: ఎంసెట్‌తో పాటు ఇతర ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్ధులకు ప్రత్యేక ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా వీళ్లందరికీ చివరి రోజు ఎంసెట్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించనున్నారు.
అటు విద్యార్ధుల సంఖ్యను బట్టి చివరి రోజు ఒకటి లేదా రెండు ప్రత్యేక కేంద్రాలను అధికారులు కేటాయిస్తారు. అయితే దీనికోసం విద్యార్ధులు ముందుగానే ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఆ పరీక్షా కేంద్రాల్లో డ్యూటీ చేసే ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు అందజేస్తామని చెప్పారు. కాగా, ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షను సెప్టెంబర్ 9, 10, 11, 14వ తేదీల్లో.. అలాగే అగ్రికల్చర్ విభాగం పరీక్షను మూడు రోజుల పాటు నిర్వహిస్తామని చైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు.
Also Read:
‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!
అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ధోని..
వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..
భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..