Coronavirus: రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుంటేనే రైళ్లలోకి అనుమతి.. కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు..

Coronavirus: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని దండెత్తుతోంది. చాప కింద నీరులా నెమ్మదిగా మళ్లీ విజృంభించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి...

Coronavirus: రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుంటేనే రైళ్లలోకి అనుమతి.. కీలక నిర్ణయం తీసుకున్న అధికారులు..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 08, 2022 | 4:34 PM

Coronavirus: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని దండెత్తుతోంది. చాప కింద నీరులా నెమ్మదిగా మళ్లీ విజృంభించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో లక్ష మార్కును దాటేశాయి. డెల్టా వేరియంట్‌కు, ఒమిక్రాన్‌ తోడవడంతో కేసుల విపరీతంగా పెరిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు, అధికారులు చర్యలకు పూనుకున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక మరికొన్ని రాష్ట్రాలు కఠిన ఆంక్షలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని చెబుతూనే మరోవైపు ఆంక్షలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చెన్నై రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

చెన్నైలోని లోకల్‌ రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందేనని కండిషన్ పెట్టారు. రెండో టీకా వేయించుకున్నట్టు సర్టిఫికెట్‌ ఉన్నవారికే టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 10 నుంచి 31 వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు సదరన్‌ రైల్వే ప్రకటించింది. వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ లేని వారికి రైళ్లలోకి అనుమతి ఉండదని తేల్చి చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిబంధనలో ఎవరికీ మినహాయింపు లేదని, మొబైల్‌ ఫోన్‌లో యూటీఎస్‌ ద్వారా టికెట్‌ పొందే అవకాశాన్ని తాత్కలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Rashmika Mandanna: రష్మిక పేరు మారిపోయింది.. మందన్న కాస్త మడోనాగా.. ఎందుకంటే..

Bird of the Week: అరుదైన పక్షి.. అచ్చం కర్రపుల్లలా.. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ప్రకృతి చేసిన ప్రత్యేక ఏర్పాటు

Dolo 650: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న డోలో 650 ట్యాబ్లెట్.. ఎందుకో తెలిస్తే నవ్వాపుకోలేరు..