Central Funds: కరోనా కష్టంలో రాష్ట్రాలకు కేంద్ర పెద్ద ఊరట.. వడ్డీ లేకుండా 50 ఏళ్ళ రుణం
కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అండగా నిలిచే శుభవార్తను వెల్లడించింది. ఏడాది కాలంగా దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న పరిస్థితి.

Central Funds for states from Central Government: కరోనా కష్టకాలం (CORONA PANDEMIC)లో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అండగా నిలిచే శుభవార్తను వెల్లడించింది. ఏడాది కాలంగా దేశంలో కరోనా వైరస్ (CORONA VIRUS) విలయతాండవం చేస్తున్న పరిస్థితి. దాన్ని నియంత్రించేందుకు లాక్ డౌన్లు (LOCK DOWNS), కరోనా ఆంక్షలు (CORONA RESTRICTIONS) విధిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం గణనీయంగా పడిపోయిన క్రమంలో రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద నిధులు సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT OF INDIA) నిర్ణయించింది. 50 సంవత్సరాల పాటు ఎలాంటి వడ్డీ లేకుండా ఏటా 15 వేల కోట్ల రూపాయల అదనపు మొత్తాన్ని రాష్ట్రాలకు సమకూర్చాలని కేంద్ర ఆర్థిక శాఖ (UNION FINANCE MINISTRY) నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22) మార్గదర్శకాలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ కొత్త పథకం కింద ఎలాంటి వడ్డీ లేకుండా 50 సంవత్సరాల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్రాలకు అందజేస్తారు. ఇందుకోసం గత ఆర్థిక సంవత్సరం (2020-21)కి గాను 12 వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. ఇందులో 11 వేల 830 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు విడుదల చేశారు.
గత ఆర్థిక సంవత్సరాన్ని కోవిడ్ (COVID-19) మహమ్మారి కుమ్మేసిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మూలధన వ్యయం రుణం తాలూకు నిధులు రాష్ట్రాలకు ఉపయోగపడ్డాయి. ఈ పథకం కింద నిధులను రాష్ట్రాలు తమ సాధారణ స్థాయి కార్యకలాపాలకు వినియోగించుకున్నాయి. కొన్ని రాష్ట్రాలు కరోనా నియంత్రణలో వినియోగించుకున్నాయి. అయితే ఈ కొత్త పథకానికి వచ్చిన సానుకూల స్పందనను దృష్టిలో పెట్టుకుని, కొన్ని రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ పథకాన్ని కొనసాగించాలని తలపెట్టింది. ఈ ప్రత్యేక సహాయ పథకం కింద ప్రధానంగా మూడు విభాగాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒకటి ఈశాన్య రాష్ట్రాలు (NORTH EASTERN STATES), కొండప్రాంత రాష్ట్రాలకు వర్తిస్తుంది. మొదటి విభాగం కింద 2,600 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. రెండో విభాగంలో 7,400 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం (FINANCE COMMISSION) అవార్డు మేరకు కేంద్ర పన్నుల్లో వాటా దామాషా విధానంలో రాష్ట్రాలకు కేటాయిస్తారు.
ఇక మూడో భాగం కింద రాష్ట్రాలకు మానిటైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ రీసైక్లింగ్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (PUBLIC SECTOR ENTERPRISES) తరపున రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తారు. పెట్టుబడుల ఉపసంహరణ (DISINVESTMENT)కు ప్రోత్సాహకంగా ఈ నిధులు రాష్ట్రాలకు అందుతాయి. ఈ మూడో భాగం కింద కొత్త పథకం మేరకు ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ఆర్థిక శాఖ కేటాయించింది. అసెట్ మానిటైజేషన్ (ASSET MONETISATION), లిస్టింగ్ (LISTING), డిజిన్వెస్ట్మెంట్ (DISINVESTMENT) ద్వారా సమకూర్చుకున్న నిధులలో 33 శాతం నుంచి 100 శాతం వరకు మొత్తాన్ని 50 సంవత్సరాల పాటు వడ్డీలేని రుణంగా రాష్ట్రాలు తమ అవసరాల కోసం వినియోగించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కరోనా ప్రభావం దేశంలోని పలు ప్రాంతాలపై తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో పలు నిబంధనలు, ఆంక్షలు అమలులో ఉన్నాయి. దానికి తోడు రాత్రిపూట కర్ఫ్యూ (NIGHT CURFEW)ను పలు రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి. పలు మెట్రో నగరాల్లో (METRO CITIES) రాత్రిపూట కర్ఫ్యూ కారణంగా ఎన్నో వ్యాపార వాణిజ్య సంస్థలను సాయంత్రానికి మూసివేసే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మెట్రో నగరాల నుంచి గణనీయంగా ఆదాయాన్ని పొందుతున్న రాష్ట్రాలు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముంబై (MUMBAI), పూణే (PUNE), నాగపూర్ (NAGPUR) వంటి మెట్రో నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగడంతో పాటు పగటిపూట కూడా పలు ఆంక్షలు అమలులో ఉన్నందున మహారాష్ట్ర (MAHARASHTRA) ప్రభుత్వం తమ ఆదాయంలో చాలా భాగం కోల్పోతోంది. అదే రకంగా బెంగుళూరు (BENGALURU) కారణంగా కర్ణాటక (KARNATAKA), చెన్నై (CHENNAI) కారణంగా తమిళనాడు (TAMILNADU), హైదరాబాద్ (HYDERBAD) కారణంగా తెలంగాణ (TELANGANA) వ్యాపార వాణిజ్య సముదాయాలపై ఆంక్షలు విధించి గణనీయంగా ఆదాయాన్ని నష్టపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త పథకం ద్వారా రాష్ట్రాలకు ఎంతో కొంత ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.




