మనుషుల నుంచి పిల్లులకు కరోనా, వూహాన్ షాకింగ్ న్యూస్

మనుషుల నుంచి పిల్లులకు కరోనా వైరస్ సోకుతోందని వూహాన్ లోని రీసెర్చర్లు తెలిపారు. 102 పిల్లుల నుంచి రక్త నమూనాలను సేకరించి చూస్తే ఈ షాకింగ్ వాస్తవం బయటపడిందని ఈ సిటీలోని హువా జాంగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ..

మనుషుల నుంచి పిల్లులకు కరోనా, వూహాన్ షాకింగ్ న్యూస్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 10, 2020 | 5:37 PM

మనుషుల నుంచి పిల్లులకు కరోనా వైరస్ సోకుతోందని వూహాన్ లోని రీసెర్చర్లు తెలిపారు. 102 పిల్లుల నుంచి రక్త నమూనాలను సేకరించి చూస్తే ఈ షాకింగ్ వాస్తవం బయటపడిందని ఈ సిటీలోని హువా జాంగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. కోవిడ్ రోగులు తమ పెంపుడు జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, తమకు తాము క్వారంటైన్ లోకి వెళ్ళాలి అని వారు సూచించారు. గత జనవరి నుంచి మార్చి వరకు.. ఆ మధ్య కాలంలో తాము మొత్త్తం 141 పిల్లుల బ్లడ్ శాంపిల్స్ సేకరించి  చూసినట్టు వారు తెలిపారు. పిల్లులు, కుక్కలను పెంచుకుంటున్న యజమానులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇక 15 పిల్లుల్లో కోవిడ్-19 యాంటీ బాడీలను కనుగొన్నాం.. 11 పిల్లుల్లో సార్స్-కోవ్-2 న్యూట్రలైజ్డ్ యాంటీ బాడీలు ఉన్నట్టు నిర్ధారించుకున్నాం అని వారు పేర్కొన్నారు.

ఇప్పటివరకు మానవుల నుంచి జంతువులకు కోవిడ్ సోకుతుందనడానికి పెద్దగా ఆధారాలు లేకపోయాయి. అయితే తాజాగా వీరు ఇందుకు ఆధారాలు ఉన్నాయని  ఖరా ఖండిగా చెబుతున్నారు.