టాప్ హీరోలను బీట్ చేసి.. అగ్రస్థానంలోకి సోనూసూద్..
బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి అగ్ర స్థానంలో నిలిచాడు నటుడు సోనూసూద్. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సోనూసూద్ రియల్ హీరోగా మారిపోయాడు. కరోనా వైరస్ కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీలకు...
బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి అగ్ర స్థానంలో నిలిచాడు నటుడు సోనూసూద్. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సోనూసూద్ రియల్ హీరోగా మారిపోయాడు. కరోనా వైరస్ కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీలకు సోనూసూద్ అండగా నిలిచాడు. ప్రత్యేకమైన బస్సులు, రైళ్లు ఏర్పాట్లు చేసి వారిని వారి స్వస్థలాలకు చేర్చాడు. అంతేకాకుండా వారు తినేందుకు ఆహారాన్ని కూడా సమకూర్చాడు సోనూసూద్.
కాగా తాజాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమాన్ బ్రాండ్స్ (IIHB) నిర్వహించిన ఓ సర్వేలో బాలీవుడ్ స్టార్ హీరోలను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు సోనూసూద్. కరోనా వైరస్ నేపథ్యంలో సోనూ అందరికీ సర్వీస్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆయన తన సర్వీస్‌ను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమే ఇప్పుడు ఆయనను టాప్ స్టానంలో నిలబెట్టింది.
ఐఐహెచ్‌బి చేసిన సర్వేలో భాగంగా.. అమితాబచ్చన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోలను బీట్ చేసి.. నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో అక్షయ్ కుమార్ ఉంటే, మూడో స్థానంలో అమితాబ్ నిలిచారు. ప్రజలకు సేవలు చేసిన సెలబ్రిటీల పనితీరుపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ ఈ సర్వేను నిర్వహించింది. దీంతో మరోసారి సోషల్ మీడియాలో సోనూసూద్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Read More: