కరోనా’విలయం’ లో భారత్.. మూడో స్థానంలో డేంజర్ బెల్స్ !

కరోనా వైరస్ కేసులో ఇండియా మూడో స్థానంలోకి చేరింది. అమెరికా, బ్రెజిల్ తరువాత ఈ స్థానానికి 'దిగజారింది'. ఆదివారం సాయంత్రానికి ఈ దేశంలో 6.9 లక్షల కేసులు నమోదైనట్టు..

కరోనా'విలయం' లో భారత్.. మూడో స్థానంలో డేంజర్ బెల్స్ !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 06, 2020 | 12:25 PM

కరోనా వైరస్ కేసులో ఇండియా మూడో స్థానంలోకి చేరింది. అమెరికా, బ్రెజిల్ తరువాత ఈ స్థానానికి ‘దిగజారింది’. ఆదివారం సాయంత్రానికి ఈ దేశంలో 6.9 లక్షల కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రష్యాలో 6.8 లక్షల కేసులుండగా.. దాన్ని ఇండియా క్రాస్ చేసింది. బ్రెజిల్ లో 15 లక్షలు, అమెరికాలో 28 లక్షల కేసులు నమోదైనట్టు యుఎస్ లోని జాన్స్ హాప్ కేన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇండియాలో గత 24 గంటల్లో 25 వేల కేసులు నమోదై.. 613 మరణాలు సంభవించాయి. ఇవి ఇప్పటివరకు నమోదైన అత్యధిక కేసులని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై నగరంలో  ఏడు వేల కేసులు రిజిస్టర్ అయినట్టు అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 6,97,413 కాగా.. మృతుల సంఖ్య 19,693 కి చేరింది. రికవరీ రేటు 60.85 శాతం ఉంది.

ఢిల్లీలో కరోనా ప్రభావం కొంతవరకు తగ్గిందని, రాపిడ్ యాంటిజెన్ టెస్టులను  ముమ్మరం చేశామని ఆ ప్రభుత్వం తెలిపింది. మరో వైపు కేరళ రాజధాని తిరువనంతపురం లోట్రిపుల్ లాక్ డౌన్ విధించారు. ఈ ఆంక్షలు నేటి నుంచి వారం రోజుల పాటు అమలులో ఉంటాయి. పశ్చిమ బెంగాల్ లో ఒక్కరోజే 895 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 21 మంది మరణించారు. కోల్ కతా లో 244 కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అస్సాంలో ఈ వైరస్ సామాజిక వ్యాప్తి దశ లోకి చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంతా బిశ్వ శర్మ ప్రకటించారు. గత పది రోజుల్లో ఈ రాష్ట్రంలో 2,700 కేసులు నమోదయ్యాయి.\\