ఎర్రగడ్డ రైతు బజార్లో కరోనా కలకలం.. మూడు రోజులు మూసివేత

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ రైతు బజార్లో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఎర్రగడ్డ రైతు బజారులోని ఓ కాంట్రాక్టర్‌ కరోనా వైరస్‌తో మృతి చెందారు. దీంతో మూడు రోజుల పాటు ఎర్రగడ్డ రైతు బజార్‌ను మూసివేస్తున్నారు అధికారులు. ముందుగా రైతు బజార్లో‌ శానిటైజైషన్‌ చేశారు. అలాగే ఆయనతో కాంటాక్ట్ అయిన వ్యక్తులను..

  • Updated On - 1:38 pm, Mon, 6 July 20 Edited By:
ఎర్రగడ్డ రైతు బజార్లో కరోనా కలకలం.. మూడు రోజులు మూసివేత

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ రైతు బజార్లో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఎర్రగడ్డ రైతు బజారులోని ఓ కాంట్రాక్టర్‌ కరోనా వైరస్‌తో మృతి చెందారు. దీంతో మూడు రోజుల పాటు ఎర్రగడ్డ రైతు బజార్‌ను మూసివేస్తున్నారు అధికారులు. ముందుగా రైతు బజార్లో‌ శానిటైజైషన్‌ చేశారు. అలాగే ఆయనతో కాంటాక్ట్ అయిన వ్యక్తులను హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. కాగా ఎర్రగడ్డ రైతు బజార్‌లో కరోనా కలకలంతో.. మార్కెట్‌కు వెళ్లినవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు.

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 5290 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1590 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 23902 కేసులు నమోదు కాగా, 295 మంది మృతి చెందారు. కాగా.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 12703 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 10904 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Read More: 

రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గిన చైనా సైన్యం..

గోల్డ్ కొనాలనుకునే వారికి ఆర్బీఐ బంపర్ ఆఫర్..

బ్రేకింగ్: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా