కరోనా బారినపడ్డ బీజేపీ ఎమ్మెల్యే

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని.. ప్రజాప్రతినిధుల వరకు అందర్నీ తాకుతోంది. ముఖ్యంగా మనదేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న..

కరోనా బారినపడ్డ బీజేపీ ఎమ్మెల్యే
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 08, 2020 | 11:55 AM

కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. సామాన్య ప్రజల నుంచి మొదలుకొని.. ప్రజాప్రతినిధుల వరకు అందర్నీ తాకుతోంది. ముఖ్యంగా మనదేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ప్రజాప్రతినిధులు ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు ఇలా అంతా కరోనా బారినపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా బీజేపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ముక్తా తిలక్‌ కరోనా బారినపడ్డారు. ఆమె పుణే నగరంలోని కస్బా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తాను కరోనా బారినపడ్డట్లు స్వయంగా ఆమె తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. తనకు, తన తల్లికి ఇన్ఫెక్షన్‌ సోకిందనీ.. మా ఇద్దరికి కూడా కరోనా లక్షణాలు లేవని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు తామిద్దరం హోం ఐసోలేషన్‌ అయ్యామన్నారు. కాగా, తామ కుటుంబంలోని ఇతర సభ్యులకు కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపారు.