కరోనాను ప్రభలుతున్నా…ప్రారంభమైన ముంబై సిటీ బస్సులు

లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో ముంబైలో సిటీబస్సుల రాకపోకలు తిరిగి ప్రారంభయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశంలతో బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) సిటీ బస్సు సర్వీసులను నడుపుతున్నారు. అన్‌లాక్‌ 1.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వటంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మొదలయ్యాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబైలలో కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడి జనం బయటకు వచ్చేందుకు […]

కరోనాను ప్రభలుతున్నా...ప్రారంభమైన ముంబై సిటీ బస్సులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 12, 2020 | 9:36 AM

లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో ముంబైలో సిటీబస్సుల రాకపోకలు తిరిగి ప్రారంభయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశంలతో బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) సిటీ బస్సు సర్వీసులను నడుపుతున్నారు.

అన్‌లాక్‌ 1.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వటంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మొదలయ్యాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబైలలో కొన్ని ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడి జనం బయటకు వచ్చేందుకు భయపడతున్నారు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో జనం సొంత పనుల్లో బిజీగా మారుతున్నారు. ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై నగరంలో సబర్బన్ రైళ్ల రాకపోకలు పునరుద్ధరించలేదు. దీంతో సిటీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సామాజిక దూరం పాటిస్తూ ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించాలని కండక్టర్లు సూచిస్తున్నారు. ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు.