రైల్వే కొత్త ప్ర‌య‌త్నంః ఈ ట్యాప్‌లో నీళ్లు, ఆ ట్యాప్‌లో శానిటైజ‌ర్‌

రైల్వే కొత్త ప్ర‌య‌త్నంః ఈ ట్యాప్‌లో నీళ్లు, ఆ ట్యాప్‌లో శానిటైజ‌ర్‌

రైల్వే స్టేష‌న్‌లో చేతులు శుభ్రం చేసుకునేందుకు ఓ నూత‌న విధానాన్ని ముందుకు తీసుకువ‌చ్చింది. ట్యాప్‌కి బ‌దులుగా తాక‌న‌వ‌స‌రం లేకుండా ఉండే ట‌చ్ ఫ్రీ హ్యాండ్ వాష్‌ను అందుబాటులోకి తెచ్చింది. ముందుగా వీటిని బెంగుళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేష‌న్లో..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 14, 2020 | 8:08 PM

దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ఎంతా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే ఎంతో మంది రాజ‌కీయ నాయ‌కులు, సినీ, క్రీడా సెల‌బ్రిటీలు కోవిడ్ బారిన ప‌డుతూనే ఉన్నారు. మ‌రికొంత మంది ఈ వైర‌స్ ప్ర‌భావం తట్టుకోలేక ప్రాణాలు వ‌దిలేస్తున్నారు. ఈ క‌రోనా వ్యాప్తి కార‌ణంగా దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్ర‌జ‌లు త‌మ దైనందిన జీవితంలో అనే మార్పుల‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకుని తాజాగా భార‌త రైల్వే సంస్థ స‌రికొత్త ఆలోచ‌న చేసింది.

రైల్వే స్టేష‌న్‌లో చేతులు శుభ్రం చేసుకునేందుకు ఓ నూత‌న విధానాన్ని ముందుకు తీసుకువ‌చ్చింది. ట్యాప్‌కి బ‌దులుగా తాక‌న‌వ‌స‌రం లేకుండా ఉండే ట‌చ్ ఫ్రీ హ్యాండ్ వాష్‌ను అందుబాటులోకి తెచ్చింది. ముందుగా వీటిని బెంగుళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేష‌న్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ఇండియ‌న్ రైల్వే సంస్థ‌ ట్వీట్ చేసింది. మ‌న భ‌ద్ర‌త మ‌న చేతుల్లోనే ఉందంటూ క్యాప్ష‌న్ కూడా జోడించింది. ఇక భార‌తీయ రైల్వే చేసిన ఈ ట్వీట్‌కి సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతు‌న్నాయి. ఇలాంటివి దేశంలో ఉన్న అన్ని రైల్వే స్టేష‌న్‌ల‌లో అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read More:

ఈ నెల 17 నుంచి ఇంట‌ర్ ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు

బ్రేకింగ్ః క‌రోనాను జ‌యించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఓటీటీల్లో న‌టించేందుకు మెగాస్టార్ సిద్ధంః అల్లు అర‌వింద్‌

ఈ నెల 19న ఆంధ్రప్ర‌దేశ్‌ కేబినెట్ స‌మావేశం

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu